BigTV English

India Vs Australia T20 : ప్రసిద్ధ్ ఔట్…మరో ఇద్దరు డౌట్ఆసిస్ తో నాలుగో టీ 20 మ్యాచ్ కు ఇండియాలో మార్పులు

India Vs Australia T20 : ప్రసిద్ధ్ ఔట్…మరో ఇద్దరు డౌట్ఆసిస్ తో నాలుగో టీ 20 మ్యాచ్ కు ఇండియాలో మార్పులు

India Vs Australia T20 : డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయలేక ఒత్తిడిలో పరుగులు ఇచ్చేస్తున్న ప్రసిద్ధ్ కృష్ణ పై వేటు తప్పేలా లేదు. అయితే అతనొక్కడిని బలిపశువును చేయడం తగదని అంటున్నారు. ఎందుకంటే ఇదే ప్రసిద్ధ్ ఆసిస్ తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో 18 వ ఓవర్ వేశాడు. అయితే అప్పుడు 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 19 ఓవర్ వేసిన అక్షర్ పటేల్ 22 పరుగులిచ్చాడు. అయితే అందులో 11 పరుగులు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ దయవల్ల వచ్చినవి.


ఇక ఆఖరి ఓవర్ లో 21 పరుగులను ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. 18వ ఓవర్ వేసినట్టే వేస్తాడు…10 లేదా 15 పరుగులు వస్తాయనుకుంటే ఏకంగా 23 పరుగులు వచ్చాయి. ఇప్పుడదే ప్రసిద్ధ్ కి పెద్ద మైనస్ గా మారింది. నాలుగో టీ 20 మ్యాచ్ లో పక్కకు తప్పిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

వన్డే వరల్డ్ కప్ 2023లో హార్దిక్ పాండ్యా బదులు మరొక ఆటగాడిని తీసుకోవాల్సిన పరిస్థితుల్లో రాహుల్ ద్రవిడ్ ఎంతో నమ్మకం పెట్టి ప్రసిద్ధ్ క్రష్ణని ఎంపిక చేశాడు. అయితే తనక్కడ రిజర్వ్ బెంచ్ కే పరిమితమైనా వరల్డ్ కప్ టీమ్ లో ఉండటం అనేది చాలా గొప్ప విషయం…అలాంటి ప్రసిద్ధ్ ని చూస్తే డెత్ ఓవర్స్ లో 21 పరుగులను ఆపలేకపోవడం టీమ్ మేనేజ్మెంట్ ని కలవరపెడుతోంది.


మరో ఆరునెలల్లో ప్రారంభమయ్యే టీ 20 ప్రపంచకప్ ముందు యువ ఫాస్ట్ బౌలర్లు ఇలా తేలిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మ్యాక్స్ వెల్ లాంటి ప్రమాదకరమైన ఆటగాళ్లు అవతలి వైపుంటే ఏ బౌలర్ కూడా ఏమీ చేయలేడు. కానీ 21 పరుగులు చిన్న విషయం కాదని అంటున్నారు.

ప్రసిద్ధ్ స్థానంలో దీపక్ చాహర్ ని తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. బ్యాటర్ తిలక్ వర్మని కూడా పక్కన పెడుతున్నారు. ఎందుకంటే శ్రేయాస్ అయ్యర్ రాకతో తన స్థానానికి గండి పడుతోంది. ఇక మొన్ననే పెళ్లి చేసుకోవడానికి వెళ్లిన ముఖేష్ కుమార్ మళ్లీ జట్టులోకి వస్తున్నాడు. అతని స్థానంలో వచ్చి మూడో టీ 20 ఆడిన ఆవేష్ ఖాన్ మళ్లీ రిజర్వ్ బెంచ్ కే పరిమితం అయ్యేలా ఉన్నాడు.

ఎవరైనా సరే, వచ్చిన అవకాశాన్ని మహ్మద్ షమీలా ఉపయోగించుకుంటే టీమ్ ఇండియాలో స్థానం పర్మినెంట్ అవుతుందని అంటున్నారు. తను భావి భారత క్రికెట్ కే కాదు, ప్రజలందరికీ కూడా ఇన్సిపిరేషన్ అంటున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×