E-Paper
Advertisement

Hi Nanna Pre Release Event : ఒట్టేసి చెబుతున్న ఇది అలాంటి సినిమా కాదు.. నాని స్టేట్మెంట్ వైరల్..

Hi Nanna Pre Release Event : ఒట్టేసి చెబుతున్న ఇది అలాంటి సినిమా కాదు.. నాని స్టేట్మెంట్ వైరల్..
Advertisement
Hi Nanna Pre Release Event

Hi Nanna Pre Release Event : నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కాంబోలో శౌర్యవ్ దర్శకత్వంలో త్వరలో మన ముందుకు రాబోతున్న చిత్రం హాయ్ నాన్న.వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 7న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ తో జోరు పెంచిన చిత్ర బృందం.. వెరైటీ కాన్సెప్ట్స్ తో అందరిని ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్..సాంగ్స్.. మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు మూవీ పై ఆసక్తిని రేపుతున్నాయి.

మరోపక్క నాని.. మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటూ అన్ని తానే చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న వైజాగ్ లో హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో తన స్టైల్ సందడి చేసిన నాని మాట్లాడుతూ.. ‘వైజాగ్ కు నాకు ఎంతో స్పెషల్ అనుబంధం ఉంది. పిల్లనిచ్చారు అని కాదు కానీ.. నా ప్రతి సినిమా.. హిట్ అయినా ఫ్లాప్ అయినా.. ఎక్కడ ఆడినా.. ఆడకపోయినా.. వైజాగ్ లో మాత్రం మంచిగా ఆడుతుంది. అందుకే నాకు వైజాగ్ అంటే ఎంతో ఇష్టం’ అని వైజాగ్ తో తనకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నాడు.

Advertisement

ఇక డిసెంబర్ లో విడుదలయ్యే సినిమాల గురించి కూడా నాని తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. డిసెంబర్ నెలలో చాలా సినిమాలు వస్తున్నాయని ..అన్ని బాగా విజయవంతంగా ఆడాలని కోరుకుంటున్నాను.. అని చెప్పాడు. ప్రభాస్ అన్న సలార్ తో పాటు.. నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, సుమ కొడుకు రోషన్.. బబుల్ గమ్, ఇక షారుక్ డంకీ. ఇలా డిసెంబర్ నెల సినిమాల సందడిగా ఉంటుంది అని అన్నాడు. ఈ సినిమాలో అన్ని మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నట్టు తెలియపరిచాడు.

ఇక హాయ్ నాన్న మూవీ విషయం గురించి మాట్లాడుతూ.. మూవీలో తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ అనగానే ఎమోషనల్ గా ఉంటుందని అందరూ భావిస్తున్నారని.. అయితే నిజంగా ఇది ఏడిపించే సినిమా కాదని.. మీరు అనుకున్నట్టు హాల్ నుంచి ఏడుస్తూ కాక నవ్వుతూ వెళ్తారు అని నాని అన్నాడు. అలాగే సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అతడు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశాడు. అంతేకాకుండా డిసెంబర్ 7న అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడండి అని ఇన్విటేషన్ కూడా ఇచ్చాడు. మరి ఈ మూవీ అందరి అంచనాలకు తగినట్టుగా పెర్ఫార్మ్ చేస్తుందో లేదో డిసెంబర్ 7న తెలుస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×