BigTV English
Advertisement

India vs Sri Lanka : ఆడితే ఆడాలిరా.. రఫ్పాడాలి.. ఇండియా చేతిలో శ్రీలంక చిత్తు చిత్తు

India vs Sri Lanka : ఆడితే ఆడాలిరా.. రఫ్పాడాలి.. ఇండియా చేతిలో శ్రీలంక చిత్తు చిత్తు

India vs Sri Lanka : అయ్యో.. అయ్యో.. అని నిజమైన క్రీడాభిమానులందరూ బాధపడ్డారు. శ్రీలంక బ్యాట్స్ మెన్ అవుట్ అవుతున్న తీరు చూసి అంతా అవాక్కయిపోయారు. ఒక దశలో వికెట్లు పడుతున్న ఆనందాన్ని కూడా మనస్ఫూర్తిగా అనుభవించలేక పోయారు. మరోవైపు ఇండియా మాత్రం వరల్డ్ కప్ లో పరుగుల పరంగా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి సెమీస్ లో అడుగుపెట్టింది.


మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్ కి వచ్చిన శ్రీలంక టాప్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ఇండియా బౌలర్ల ధాటికి  విలవిల్లాడింది. ఒకదశలో 14 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి అత్యల్పస్కోరుకే ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. కానీ బౌలర్లు వచ్చి ఆదుకోవడంతో గుడ్డిలో మెల్లగా ఆ పరిస్థితి రాకుండా బయటపడ్డారు.

ముంబయి వాంఖేడి స్టేడియలో వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ వచ్చారు. అయితే ఈసారి కెప్టెన్ 4 పరుగులు చేసి మొదటి ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. దీంతో కొహ్లీ మీద బాధ్యత పడింది. అలా గిల్ తో కలిసి కొహ్లీ జట్టు స్కోరుని పరుగులెత్తించాడు.


30 ఓవర్ వచ్చేసరికి 193 పరుగుల మీద గిల్ అవుట్ అయ్యాడు. 92 పరుగులు చేసి సెంచరీకి 8 పరుగుల దూరంలో ఆగిపోవడంతో అందరూ అయ్యో అనుకున్నారు. తను కూడా నిరాశగానే పెవెలియన్ చేరాడు. ఇందులో 11 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. తర్వాత కొహ్లీ వంతు వచ్చింది. గిల్ అయిన వెంటనే జట్టు స్కోరుకి 3 పరుగులు జోడించి 88 పరుగుల మీద అయిపోయాడు. తను సెంచరీకి 12 పరుగుల దూరంలో ఆగిపోయాడు. తర్వాత శ్రేయాస్ అయ్యర్ వచ్చాడు. అప్పుడు మొదలైంది అసలైన ఆట.

వరల్డ్ కప్ నెక్ట్స్ మ్యాచ్ లో డౌట్ అని అంతా అనుకున్న సమయంలో శ్రేయాస్ జూలు విదిల్చాడు. 56 బంతుల్లో 82 పరుగులు చేసి శ్రీలంక బౌలర్ల భరతం పట్టాడు. స్కోర్ బోర్డుని 300 దాటించాడు. తన స్కోరులో 6 సిక్స్ లు, 3 ఫోర్లు ఉన్నాయి. తను కూడా 18 పరుగుల దూరంలో సెంచరీ మిస్ అయ్యాడు. తర్వాత కేఎల్ రాహుల్ (21), సూర్యకుమార్ (12), రవీంద్ర జడేజా (35 ), షమీ (2) ఇలా తలా కొన్నిచేసి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేశారు.
శ్రీలంక బౌలింగ్ లో దిల్షాన్ మధుషంక 5, చమీరా ఒక వికెట్టు తీశారు.

భారీ లక్ష్య ఛేదనకు వచ్చిన శ్రీలంక ముందే ఫిక్స్ అయి వచ్చినట్టుంది. అనుకున్నట్టుగానే భారత బౌలర్ల ధాటికి గిలగిల్లాడింది. బూమ్రా, సిరాజ్ ధాటికి 3 పరుగులకి 4 వికెట్లు పడిపోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ దశలో షమీ బౌలింగ్ కి వచ్చాడు. అంతే ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసేసరికి శ్రీలంక 14 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. శ్రీలంక బ్యాట్స్ మెన్లలో ఐదుగురు డకౌట్ కావడం విశేషం.

కాసూన్ రజిత (14) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మాథ్యూస్ (12), తీక్షణ (12) మాత్రమే డబల్ డిజిట్ చేశారు.
మధుషంకర (5), ఛరిత్ అశలంక (1), కెప్టెన్ కుశాల్ మెండీస్ (1) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇక నిశాంక, కరుణరత్నే, సమరవిక్రమ, దుషాన్ హేమంత, దుష్మంత చమీర వీరు ఐదుగురు డకౌట్ అయ్యారు. మొత్తానికి భారత పేసర్ల ధాటికి 19.4 ఓవర్లలో 55 పరుగులకే శ్రీలంక కుప్పకూలిపోయింది. భారత బౌలర్లలో షమీ 5, సిరాజ్ 3, బుమ్రా, జడేజా ఒకొక్క వికెట్ తీసుకున్నారు. శ్రీలంకపై గెలుపుతో లెక్కలు, సమీకరణాల గొడవ లేకుండా డైరక్టుగా ఇండియా సెమీస్ చేరింది.

Related News

Virat Kohli Restaurant: గోవాపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోట‌ల్ లాంచ్‌, ధ‌ర‌లు వాచిపోతాయి

Hong Kong Sixes 2025: మ‌రోసారి ప‌రువు తీసుకున్న పాకిస్తాన్‌…బ‌ట్ట‌ర్‌ ఇంగ్లీష్ రాక ఇజ్జ‌త్ తీసుకున్నారు

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

Big Stories

×