BigTV English

Virat Kohli in Final Match : ఇక కోహ్లీ ఫస్ట్ డౌన్ ? దుబె వెళతాడు.. సంజూ వస్తాడు ?

Virat Kohli in Final Match : ఇక కోహ్లీ ఫస్ట్ డౌన్ ? దుబె వెళతాడు.. సంజూ వస్తాడు ?

Virat Kohli in Final Match(Latest sports news today): క్రికెట్ లో మహోన్నత శిఖరం లాంటి విరాట్ కోహ్లీని ఫస్ట్ డౌన్ తీసుకురావాలని టీమ్ మేనేజ్మెంట్ సూత్రప్రాయంగా అంగీకరించిందని అంటున్నారు. ఎందుకంటే మ్యాచ్ లో శివమ్ దుబె పాత్ర అనిశ్చంగా ఉంది. అటు బౌలింగులో కూడా వాడటం లేదు. ఇటు బ్యాటర్ గా కూడా రాణించడం లేదు. అంటే రెండు మ్యాచ్ ల గెలుపులో తన పాత్ర ఉంది కానీ, వికెట్లు పడకుడా ఆడగలిగాడని చెప్పాలి. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఇది సరిపోదని అంటున్నారు.


ఎలాగూ ముగ్గురే స్పెషలిస్టు బ్యాటర్లు ఉన్నారు. రిషబ్ పంత్ ని ప్రమోషన్ పై వాడుతున్నారంతే. ఈ ముగ్గురూ అయిపోతే, సినిమా అయిపోతోంది. కాకపోతే ఆల్ రౌండర్లు ఆదుకుంటున్నారు. ముందుకి నడుపుతున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ కి వచ్చేసరికి, ఓపెనర్ గా కోహ్లీ ఫెయిల్యూర్ ప్రయోగానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఎందుకంటే మొదటి 6 ఓవర్లలో పవర్ ప్లే ఉంటుంది. అక్కడ బంతిని గాల్లోకి కొట్టాల్సి ఉంటుంది. తన సహజసిద్ధమైన ఆటకి భిన్నంగా ఆడి కోహ్లీ అవుట్ అయిపోతున్నాడు. పవర్ ప్లే అంటూ అతనిపై అనవసర ప్రెజర్ పెడుతున్నారనే విమర్శలు నెట్టింట తీవ్రంగా వినిపిస్తున్నాయి.


Also Read : మనవాళ్లు చెప్పినట్టు బాల్స్ వేశా: అక్షర్ పటేల్

అందుకే సంజూ శాంసన్ లేదా యశస్విని తీసుకురావాలని చూస్తున్నారు. ఎలాగూ బౌలర్లలో బుమ్రా, అర్షదీప్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. స్పిన్ బౌలింగులో కులదీప్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా మొత్తం ఆరుగురు ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు ఫెయిలైనా, ఒకొక్కరితో రెండేసి ఓవర్లు వేసే అవకాశం ఉందని అంటున్నారు. లేదు విన్నింగ్ కాంబినేషన్ ను మార్చకూడదంటే ఇదే జట్టు ఇలాగే ఆడుతుందని చెబుతున్నారు.

టీ 20 ప్రపంచకప్ 2024లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సౌతాఫ్రికా, ఇండియా ఫైనల్ చేరాయి. ఈ రెండు జట్లలో ఎవరూ గెలిచినా గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు ఓటమి ఎరుగని జట్టుగా చరిత్ర స్రష్టించనుంది. ఇంతవరకు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇటువంటి ఫీట్ సాధించలేదు.

టీ20 ప్రపంచకప్‌ల్లో ఈ రెండు జట్ల మధ్య ఇంతవరకు ఆరు మ్యాచ్ లు జరిగాయి. టీమిండియా 4 సార్లు విజయం సాధించగా.. సౌతాఫ్రికా రెండు సార్లు గెలిచింది. అన్నీ పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. కానీ గ్రౌండులోకి వెళ్లిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో తెలీదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×