BigTV English

Trump vs Biden US Presidential Debate: రేసు మొదలైంది.. ఆసక్తికరంగా సాగిన ట్రంప్, బైడెన్‌ డిబేట్

Trump vs Biden US Presidential Debate: రేసు మొదలైంది.. ఆసక్తికరంగా సాగిన ట్రంప్, బైడెన్‌ డిబేట్

Trump vs Biden US Presidential Debate: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రేసు మొదలైంది. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ఆసక్తికరంగా సాగింది. ఈ డిబేట్‌లో డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు.


ఈ డిబేట్ దాదాపు 90 నిమిషాల పాటు వాడీవేడీగా సాగింది. ఇందులో ఇద్దరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. నువ్వు అబద్ధాలకోరువంటే..లేదు లేదు.. నువ్వే అబద్దాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు, విదేశాంగ విధానం, గర్భవిచ్ఛిత్తి తదితర అంశాలపై ఒకరొనొకరు ప్రశ్నలు, ఆరోపణలు చేసుకున్నారు. ఈ వివాదం అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించింది.

డిబేట్ జరుగుతున్నంత వరకు జో బైడెన్ తడబడ్డారు. ప్రసంగం మధ్యలో సడెన్‌గా మౌనం ప్రదర్శించారు. మాట్లాడేందుకు తడుముకున్నారు. ట్రంప్ మాత్రం డిబేట్ పూర్తయ్యేవరకి చాలా విశ్వాసంతో కనిపించారు. నిజం చెబుతున్నాడా లేదనే విషయన్ని పక్కన పెడితే..ట్రంప్ మాటల్లో స్పష్టత కనిపించింది. కానీ బైడెన్ మాత్రం మాటలను దాట వేసి ప్రయత్నం చేశారు.


బైడెన్ మాట్లాడుతున్న సమయంలో తనలో తాను మాట్లాడుతున్నట్లు కనిపించాడు. కొన్ని సందర్భాల్లో బైడెన్ ఏం చెబుతున్నాడో ఎవరికీ అర్థం కాకపోవడం ఆశ్చర్యం. సమయానుకూలంగా మాట్లాడలేకపోయాడు. చివరికీ ఈ డిబేట్ లో ట్రంప్ నెగ్గారని సీఎన్ఎన్ పోలింగ్ చూస్తే అర్ధమయింది. ఇందులో ట్రంప్ నకు ఏకంగా 67 శాతం మంది ఓటర్లు మద్దతు తెలపగా.. బైడెన్ కు 33 శాతం ఓట్లు లభించాయని పేర్కొంది.

దేశంలో ద్రవ్యోల్భణం కట్టడి, ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో బైడెన్ ప్రభుత్వం విపలమైందని ట్రంప్ విమర్శించారు. అలాగే ఆర్థిక విధానాలు దారుణంగా ఉన్నాయని, ఆయన సంపన్నుల అనుకూల వైఖరితో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ట్రంప్ పేర్కొన్నారు. నిరుద్యోగిత రేటు 15 శాతంకు చేరిందన్నారు. అయితే ఈ విమర్శలను బైడెన్ తిప్పికొట్టారు. అంతకుముందు ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉండేదని, తర్వాత గాడిలోకి తీసుకొచ్చినట్లు బైడెన్ సమాధానం ఇచ్చారు.

Also Read: ఆ వ్యాఖ్యలు నన్నెంతగానో బాధించాయి: రిషి సునాక్

అలాగే వలస విధానాలతోపాటు రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం, ఇజ్రాయెల్ కి మద్దతు అంశంపై చర్చించారు. అయితే ఈ డిబేట్ తర్వాత డెమోక్రటిక్ కి చెందిన సభ్యులు ఆలోచనలో పడ్డారు. బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని చెబుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. జులై 15 నుంచి 18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న జరిగే సదస్సులో డెమోక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×