SRH Political Leaders : ఐపీఎల్ మ్యాచ్ లు ఎప్పుడూ ఏ టీమ్ తమ ప్రతిభను కనబరుస్తుందో ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి స్థానంలో ఉండగా.. నిన్న ముంబై పై విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రస్తుతం తొలి స్థానానికి ఎగబాకింది. వాస్తవానికి గుజరాత్ కి 16 పాయింట్లు, రాయల్ ఛాలెంజర్స్ కి 16 పాయింట్లు ఉన్నాయి. కానీ రన్ రేట్ లో గుజరాత్ టైటాన్స్ కాస్త మెరుగ్గా ఉండటంతో గుజరాత్ మొదటి స్థానంలోకి వెళ్లింది.
Also Read : MI VS GT: గుజరాత్ పై అంబానీ కుట్రలు.. తిప్పి కొట్టిన గిల్ !
ఇక ఇదిలా ఉంటే.. ఈ సీజన్ లో పలువురు అభిమానులు జెర్సీలు ధరించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ జెర్సీ ధరించిన ఓ వ్యక్తి.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ జెర్సీ ధరించిన వ్యక్తి టీషర్ట్ ని చింపేశాడు. అలాగే ఒక చిన్న బాలుడు ఆర్సీబీ జెర్సీ ధరించి చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని తన ము**డ్డీతో తుడుచుకున్నాడు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా తెలుగు పొలిటికల్ లీడర్స్ ఏపీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు లు సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీలను ధరించి బౌలింగ్ చేస్తున్నట్టు కనిపించగా.. లాగే వీరికి అంపైర్ గా రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ పొలిటికల్ లీడర్స్ సన్ రైజర్స్ టీమ్ లో ఉన్నారని.. వీరు ధరించిన ఈ జెర్సీలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవాస్తవానికి ఈ జెర్సీలు వీరు ధరించలేదు. కానీ ఆ వీడియోని ప్రస్తుత టెక్నాలజీ ఏఐ ద్వారా క్రియేట్ చేశారు. అది వైరల్ గా మారింది. ఆర్జీవీ ఎంపైర్ గా ఔట్ అంటూ ఇచ్చిన ఫొటో వైరల్ అవుతోంది.
ఇక ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించాయి. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ల్లో ఈ జట్లు ఓడిపోవడంతో ఇక ఇంటిబాట పట్టడం తప్పడం లేదు. టాప్ 4 ప్లేస్ ల కోసం ఇప్పటికే గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు కూడా పోటీలో ఉన్నప్పటికీ పాయింట్ల పట్టిక ఈ రెండు జట్లు కాస్త వెనుకంజలో ఉన్నాయి. ఈ సీజన్ ప్రారంభంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు కాస్త ముందంజలో ఉన్నప్పటికీ వరుస ఓటమిలతో వెనుకంజలో పడింది. మరోవైపు మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో వర్షం కారణంగా ఢిల్లీకి ఒక పాయింట్ వచ్చింది. దీంతో ఢిల్లీ జట్టు ప్రస్తుతం 13 పాయింట్లతో 5 వ స్థానంలో కొనసాగుతోంది. ముంబై జట్టు 12 మ్యాచ్ లు ఆడి 14 పాయింట్లు సాధిస్తే.. ఢిల్లీ మాత్రం 11 మ్యాచ్ లు ఆడి 13 పాయింట్లు సాధించింది. ఢిల్లీ మరో మ్యాచ్ లోో గెలిస్తే.. టాప్ 4లోకి వెళ్లే అవకాశం ఉంది. ముంబై మిగతా రెండు మ్యాచ్ లు కచ్చితంగా గెలవాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు దాదాపు ప్లే ఆప్స్ చేరువయ్యాయి. మిగతా జట్లు ఏవి అనేది త్వరలోనే తేలనుంది.