Sri Vishnu Single: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న శ్రీ విష్ణు (Sri Vishnu) హీరోగా ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు. కానీ ఏ రోజు కూడా తన లిమిట్స్ క్రాస్ చేయలేదు. కానీ తొలిసారి సింగిల్ సినిమా కోసం తన హద్దులు చెరిపేసి మరీ నటించినట్లు తెలుస్తోంది. అందులోనూ మొదటి అవకాశం, కుర్రాళ్లకు క్రష్ గా మారిన ఇవానా (Ivana) తో రావడంతో అభిమానులు ఛాన్స్ అంటే నీదేనయ్యా.. మొదటి ఎక్స్పీరియన్స్ ఆ భామతో రావడం నిజంగా అదృష్టం అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..
సింగిల్ సినిమా కోసం హద్దులు చెరిపేసిన శ్రీ విష్ణు..
శ్రీ విష్ణు.. కామెడీ , కథ ప్రధానంగా సాగే ఈయన సినిమాలు ఎంత డీసెంట్ గా ఉంటాయో.. ఆయన పాత్రలు కూడా అంతే డీసెంట్ గా ఉంటాయి. హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాలు, పెదవి ముద్దులు, ఇంటిమేట్ సన్నివేశాలు లాంటివి ఊహించలేము కూడా.. కథను నమ్మి సినిమా చేస్తాడే తప్ప అసభ్యతకు చోటు ఇవ్వడు. ఇప్పటివరకు ఈయన సినిమాలు చూస్తే మనకు ఈ విషయం స్పష్టం అవుతుంది. రాముడు మంచి బాలుడు అన్నట్టు ఇప్పటివరకు శ్రీ విష్ణు అలాగే వ్యవహరించాడు. కానీ ‘సింగిల్’ సినిమాతో ఒక్కసారిగా ఆయన తన రూల్స్ బ్రేక్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.తాజాగా శ్రీ విష్ణు హీరోగా.. కేతికా శర్మ (Kethika Sharma), ఇవానా హీరోయిన్లుగా వస్తున్న చిత్రం సింగిల్. వినోదాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలకు దర్శకుడు కార్తీక్ రాజు (Karthik Raju)అవకాశం ఇచ్చారట. ఇందులో భాగంగానే ఒక సన్నివేశంలో ఇవానా – శ్రీ విష్ణు మధ్య గాఢమైన పెదవి ముద్దు సన్నివేశం ఒకటి పెట్టాడట. సీన్ డిమాండ్ చేయడం వల్లే ఈ సన్నివేశం పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లలో హీట్ పుట్టడం ఖాయమని, ఎందుకంటే ఇందులో నటించింది ఇవానా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ‘లవ్ టుడే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన ఈమె పైన అసాధారణమైన అభిమానాన్ని పెంచుకున్నారు అభిమానులు. ఇప్పుడు నేరుగా తెలుగులో సినిమా చేస్తుండడంతో ఆ అంచనాలు, అభిమానం రెట్టింపు అయిపోయాయి. ఇక ఇవానా కోసమే థియేటర్ కి వెళ్లేవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవానా క్రేజ్..
ఇవానా విషయానికి వస్తే.. లవ్ టుడే సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు సంభాషణలతో బాగా దగ్గరైన ఈమె ఇప్పుడు ఇలాంటి సీన్లలో నటిస్తే థియేటర్లలో విధ్వంసం చెలరేగడం ఖాయమని , ఈమెకు ఉన్న ఫాలోయింగ్ ను ఎలా క్యాష్ చేసుకోవాలని ఆలోచించి, ఇలా డైరెక్టర్ ప్లాన్ చేశాడా ఏంటి? అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. మరి పూర్తి వివరాలు తెలియాలి అంటే సినిమా వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. మరి అంతవరకు ఆగుతారా? లేక మధ్యలో చిత్ర బృందం స్పందించి క్లారిటీ ఇస్తుందా అన్నది చూడాలి.
ALSO READ:Singer Saketh : సొంత తమ్ముడిలాంటోడు… నమ్మించి మోసం చేశాడు.. కన్నీళ్లు పెట్టించిన సింగర్ సాకేత్..!