Sam Billings: ఇంగ్లాండ్ వేదికగా జరిగిన “ది హండ్రెడ్ 2025” క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ముగిసింది. ఆగస్టు 31వ తేదీన జరిగిన ఫైనల్ లో ఓవల్ ఇన్వెన్సిబుల్స్ మరోసారి విజేతగా నిలిచి.. ఏకంగా హైట్రిక్ టైటిల్ సాధించింది. ట్రెంట్ రాకెట్స్ పై గెలిచి వరుసగా మూడోసారి కప్ ని అందుకోవడం ద్వారా ఈ లీగ్ చరిత్రలో రికార్డు సొంతం చేసుకుంది. ఇన్వెన్సిబుల్స్.. ట్రెంట్ రాకెట్స్ పై 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read: Rohit Sharma: 22 రోజుల్లో 20 కిలోలు తగ్గిన రోహిత్ శర్మ…బ్రాంకో టెస్టు ఇక జుజుబీ
ఓవల్ ఇన్విన్సిబుల్స్ 2023లో తొలిసారి టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత 2024లో మరోసారి విజయవంతంగా డిఫెండ్ చేసింది. ఇక 2025 లో కూడా అదే క్రమాన్ని కొనసాగిస్తూ మూడవసారి వరుసగా చాంపియన్ గా నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఇన్వెన్సిబుల్స్ బ్యాటర్లలో విల్ జాక్స్ 41 బంతుల్లో 72 పరుగులు, జోర్డాన్ కాక్స్ 28 బంతుల్లో 40 పరుగులు చేశారు. వీరిద్దరూ రెండవ వికెట్ కి 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇక 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్.. నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా 26 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. మార్కస్ స్టోయినిస్ 64 పరుగులు చేసినప్పటికీ ట్రెంట్ రాకెట్స్ ని గెలిపించడంలో విఫలం చెందాడు. ఇక ఈ ఇన్నింగ్స్ లో నాథన్ స్వాట్టర్ 20 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అలాగే ఈ సీజన్ ఆధ్యాంతం సత్తా చాటడంతో ఇన్వెన్సిబుల్స్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు.
ది హండ్రెడ్ 2025 లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ {367}, అలాగే ఈ సీజన్ లో 300 ప్లస్ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఈ సీజన్ లో అత్యధిక సిక్స్ లు {22} కొట్టిన రికార్డును కూడా నెలకోల్పాడు. అయితే గత మూడు సంవత్సరాలుగా ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టుకు తన నాయకత్వంలో టైటిల్స్ అందించాడు సామ్ బిల్లింగ్స్. తద్వారా అత్యధికంగా టి-20 టైటిల్స్ గెలిచిన కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మ వంటి కెప్టెన్ల తరువాత రికార్డు సృష్టించాడు సామ్ బిల్లింగ్స్. అత్యధికంగా టి-20 టైటిల్స్ గెలుచుకున్న కెప్టెన్ల జాబితాలో మహేంద్రసింగ్ ధోని ఒకరు. ధోని 5 ఐపీఎల్ టైటిల్స్ తో పాటు CL టి-20 టైటిల్, 2007లో ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ టైటిల్ ను కూడా గెలిచారు.
Also Read: David Warner : మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో విలన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్?
అలాగే టీ-20 క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మరొకరు రోహిత్ శర్మ. ఈయన 5 ఐపీఎల్ టైటిల్స్ ని గెలుచుకున్నారు. ఇక వీరి తర్వాత మూడవ స్థానంలో సామ్ బిల్లింగ్స్ నిలిచారు. ది హండ్రెడ్ లీగ్ 2025 టోర్నమెంట్ విజేతగా నిలిచినందుకు ఓవల్ ఇన్విన్సిబుల్స్ కి £ 150,000 అనగా.. { సుమారు 1.80 కోట్లు} ప్రైజ్ మనీ దక్కింది. ఇక అదనంగా టోర్నమెంట్ టాప్ రన్ స్కోరర్ గా నిలిచిన జోర్డన్ కాక్ కు రూ. ఆరు లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభించింది.
2023 – Oval Invincibles won the Hundred.
2024 – Oval Invincibles won the Hundred.
2025 – Oval Invincibles won the Hundred.SAM BILLINGS WON THE TITLE 3 CONSECUTIVE TIMES AS CAPTAIN 🥶🔥 pic.twitter.com/h1BBoS4PKC
— Johns. (@CricCrazyJohns) September 1, 2025