Allu -Mega:తాజాగా అల్లు అరవింద్ (Allu Aravindh) తల్లి అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma) తన 94 ఏళ్ళ వయసులో వృద్ధాప్యం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఆగస్టు 30 తెల్లవారుజామున 1:45 గంటల సమయంలో ఆమె మరణించినట్టు తెలిపారు. అయితే ఈ విషయం తెలియడంతోనే అల్లు,మెగా హీరోలు తమ షూటింగ్స్ కాన్సిల్ చేసుకొని హుటాహుటిన అల్లు అరవింద్ ఇంటికి తరలివచ్చారు. అల్లు కనక రత్నమ్మ గారి చివరి చూపు కోసం అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా తమ సినిమా షూటింగ్లు వాయిదా వేసుకొని మరీ ఇంటికి తిరిగి వచ్చేసారు.
కనకరత్నమ్మ మరణం.. రూమర్స్ కి చెక్
అలాగే కనకరత్నమ్మ చనిపోయిన సమయంలో అల్లు అరవింద్ లేకపోవడంతో చిరంజీవి దగ్గరుండి చూసుకున్నారు. అలా తన అత్తగారి కళ్ళు డొనేట్ చేసిన సంగతి కూడా తాజాగా చిరంజీవి బయటపెట్టారు. ఇదంతా ఇలా ఉండగా ఇన్ని రోజులు మెగా ఫ్యామిలీ,అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయి అనే వార్తలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఒక్క ఘటనతో చెక్ పడింది అని చెప్పవచ్చు.. అలా మెగా,అల్లు ఫ్యామిలీలతో పాటు బంధువుల కన్నీళ్ల మధ్య కనకరత్నం గారి అంత్యక్రియలు ముగిసాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు హీరో నాన్నమ్మ, తాతయ్య తో ఉన్న అనుబంధాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంటూ కొన్ని అరుదైన ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు.
ఎవర్ గ్రీన్ ఫోటో షేర్ చేసిన అల్లు శిరీష్..
నానమ్మతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసిన ఆ హీరో ఎవరో కాదు అల్లు శిరీష్(Allu Sirish) .. తాజాగా అల్లు శిరీష్ తన ఎక్స్ ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టారు.. “నా ప్రియమైన నాన్నమ్మ శ్రీ కనకరత్నం ఆగస్టు 30వ తేదీ తెల్లవారుజామున కన్నుమూశారు.. ఆమె అంత్యక్రియలు పిల్లలు, మనవళ్లు,మనవరాళ్లు ముని మనవళ్లందరి సమక్షంలో జరిగింది.. ఇక నానమ్మతో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆమెతో నాకు ఎన్నో జ్ఞాపకాలు కూడా ఉన్నాయి.చిన్నతనంలో నా తండ్రి కోపం నుండి నానమ్మ నన్ను రక్షించేది. అలాగే నా పేరెంట్స్ కి తెలియకుండా సీక్రెట్ గా ఇచ్చే పాకెట్ మనీని ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకుంటాను. వేసవి సమయంలో బయటికి వెళ్లి రాగానే నా మీద స్పెషల్ కేర్ తీసుకొని నానమ్మ రాసిన ఉబ్టన్ పౌడర్ నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. ఇక నానమ్మ చివరి రోజుల్లో మేము ఆమెతో చాలా ఆనందంగా గడపాము.. నానమ్మలో ఉన్న లక్షణాలు మా అందరిలో ఉండడంవల్ల ఆమె ప్రేమ ఎల్లప్పుడూ మాకు గుర్తుంటుంది.ఎప్పటికీ ఆమెను గుర్తుంచుకుంటాం. ఇప్పటి నుండి నాన్నమ్మని చాలా మిస్ అవుతాం” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అల్లు శిరీష్.
తాతయ్య నానమ్మతో ప్రత్యేక అనుబంధం..
అంతేకాకుండా అల్లు రామలింగయ్య, మనవళ్లు, మనవరాళ్లు అందరూ కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటో కూడా షేర్ చేశారు. ఆ ఫోటోలో అల్లు రామలింగయ్య, అల్లు కనక రత్తమ్మ గార్లతో అల్లు అర్జున్, రామ్ చరణ్, శిరీష్, సుస్మిత, శ్రీజలతో పాటు అల్లు రామ లింగయ్య ఇంకో ఇద్దరు కూతుర్ల పిల్లలు కూడా ఆ ఫోటోలో ఉన్నారు. ఇక మరో ఫోటోలో అల్లు రామలింగయ్య కనకరత్నమ్మలతో శిరీష్ ఉన్నారు. అలా అల్లు శిరీష్ షేర్ చేసుకున్న ఈ ఫొటోస్ తో తాతయ్య నాన్నమ్మతో ఆయనకి ఎంత మంచి అనుబంధం ఉందో అందరికీ తెలియజేస్తున్నాయి.
ALSO READ:Keerthi bhat: బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదు..వారివల్ల అయినవాళ్ళు కూడా దూరం!
My dear ‘nanamma’, Shri Kanaka Ratnam passed away peacfully on 30th August morning early hours. Her farewell was in the midst of all her children, grandchildren and great grand children mourning her loss. ⁰⁰My fondest memories of her would be the secret pocket money she gave… pic.twitter.com/QHz0YIdKLO
— Allu Sirish (@AlluSirish) August 31, 2025