BigTV English

US Government Shutdown: అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్.. దీనివల్ల కలిగే నష్టం ఏమిటీ? ఎవరిపై ఎలాంటి ప్రభావం పడనుంది?

US Government Shutdown: అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్.. దీనివల్ల కలిగే నష్టం ఏమిటీ? ఎవరిపై ఎలాంటి ప్రభావం పడనుంది?

అమెరికా షట్ డౌన్. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ఇప్పుడు సంచలన వార్త. అమెరికా షట్ డౌన్ అయితే ఏం జరుగుతుంది, ఆ ప్రక్రియ వల్ల ప్రపంచ దేశాలపై ప్రభావం పడుతుందా, లేక అమెరికా మాత్రమే నలిగిపోతుందా? అమెరికాపై ఆధారపడ్డ చాలా దేశాలు ఈ షట్ డౌన్ వార్తలతో సతమతం అవుతున్నాయి. అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని డిసైడ్ అయ్యారు.


ఎందుకీ షట్ డౌన్..?
భారత్ వంటి దేశాల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులకు చట్ట సభల్లో ఆమోదం లభించకపోతే అధికారపక్షం మైనార్టీలో పడుతుంది. ఆటోమేటిక్ గా బల పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. సరిగ్గా ఇలాంటిదే అమెరికా షట్ డౌన్. అయితే అక్కడ అధికార, ప్రతిపక్షాల మధ్య రాజీ కుదిరితే ఈ షట్ డౌన్ ముగిసిపోతుంది. ప్రస్తుతం అమెరికా సెనేట్ లో రెండు కీలక బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో ఆటోమేటిక్ గా షట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.

ఏం జరుగుతుంది?
రిపబ్లికన్ స్టాపేజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ షట్‌డౌన్ మొదలైంది. షట్ డౌన్ మొదలైన వెంటనే అత్యవసరం కానీ సాధారణ ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోతాయి. సూటిగా చెప్పాలంటే ఇది ప్రభుత్వ ఉద్యోగులకు శాపం లాంటిది. అమెరికా ప్రభుత్వ ఉద్యోగులందర్నీ వాళ్లు పనిచేస్తున్న ఆఫీసుల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వెలువడతాయి. మిలటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి కీలక విభాగాల్లో పనిచేసేవారు, FBI ఇన్వెస్టిగేటర్స్, CIA ఆఫీసర్లకి మాత్రమే విధులు కేటాయిస్తారు. అయితే షట్ డౌన్ ఉన్నంతకాలం వీరికి జీతాలు ఇవ్వరు. ఆ తర్వాతే జీతాలు చెల్లిస్తారు. ఇక అత్యవసరం కాని ఇతర విభాగాల వారికి అసలు పనే ఉండదు. గతంలో ఓసారి ఇలాగే షట్ డౌన్ జరిగినప్పుడు అమెరికాలోని మ్యూజియంలు, పార్క్ లు నిరవధికంగా మూతబడ్డాయి. దీంతో జీతాలు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 7.50 లక్షలమంది ఉద్యోగులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ షట్ డౌన్ ప్రభావానికి గురవుతారు.


నష్టం ఎవరికి?
షట్ డౌన్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెంటనే నష్టం జరగదు. అయితే ఇది ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఆర్థిక వృద్ధిలో వారానికి 0.1 నుంచి 0.2 పాయింట్లు తగ్గిపోతాయి. అంటే ఇది దీర్ఘకాలం కొనసాగితే మాత్రం మరింత నష్టం జరగక తప్పదు. అమెరికాలోని విభాగాలతోపాటు, వాటిపై ఆధారపడిన ఇతర దేశాల వ్యాపారాలు కూడా ఇబ్బందుల్ని ఎదుర్కొంటాయి.

తప్పెవరిది?
1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు ఇలా షట్ డౌన్ కి గురైంది. 2018-19 మధ్య డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న టైమ్ లో దాదాపు 35 రోజుల పాటు ఇలాగే అమెరికా షట్ డౌన్ అయింది. మళ్లీ ఇప్పుడు ట్రంప్ హయాంలోనే అమెరికా షట్ డౌన్ కి గురికావడం ఆందోళనకరంగా మారింది. నాడు ట్రంప్ హయాంలో అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ షట్ డౌన్ ఎదుర్కోగా, మరోసారి ఆయన హయాంలోనే వచ్చిన ఈ విపత్తు ఎన్ని రోజులు కొనసాగుతుందోననే భయం అందరిలో ఉంది.

ట్రంప్ చేతగానితగనం..
తాజా షట్ డౌన్ ని ట్రంప్ చేతగానితనంగా భావిస్తున్నారు. ప్రపంచ దేశాల మీద భగ్గుమంటున్న ట్రంప్, సొంత దేశంలో పరిస్థితుల్ని చక్కదిద్దుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ అవాంతరాన్ని ట్రంప్ ఎంత త్వరగా తొలగిస్తారనేది ఆయన టాలెంట్ పై ఆధారపడి ఉంటుంది. ట్రంప్ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారితే మాత్రం నష్టపోయేది ఆ దేశ ఉద్యోగులే. ఆ తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే ప్రమాదం ఉంది. రష్యాతో స్నేహం చేస్తున్నందుకు భారత్ ని ఆడిపోసుకున్న ట్రంప్, ఇప్పుడు తన దేశాన్నే ఆర్థిక సమస్యల్లోకి నెట్టేశారని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

Related News

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

Big Stories

×