BigTV English

NEET:కర్ణాటకలో రద్దు దిశగా ‘నీట్ ’..మిగిలిన రాష్ట్రాలూ అదే బాటలో?

NEET:కర్ణాటకలో రద్దు దిశగా ‘నీట్ ’..మిగిలిన రాష్ట్రాలూ అదే బాటలో?

Karnataka urged the Centre to scrap the NEET and allow to conduct own  tests
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ అవకతవకలు బయటపడటంతో విద్యార్థులు ఉడికిపోతున్నారు. కష్టపడకుండానే దొడ్డి దారిలో ర్యాంకులు పొందిన విద్యార్థుల చర్యలతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. నీట్ పై పార్లమెంట్ సమావేశాలలోనూ ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి రద్దు చేయాలని అడుగుతున్నారు.


కాగా విద్యార్ధుల సమస్యలు అర్థం చేసుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు నీట్ రద్దు చేయాలని భావించింది. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం అసెంబ్లీ లో ప్రవేశపెట్టగా మంత్రి మండలి తమ ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయంగా ఇందుకు మరో ప్రవేశ పరీక్ష పెట్టాలనే యోచన చేస్తున్నారు అధికారులు. నీట్ ప్రవేశ పరీక్షకు పూర్వం విద్యార్థులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష 12వ తరగతి మార్కులు ప్రాతిపదికన తీసుకుని మెడికల్ పరీక్షల నిర్వహణ జరిపేవారు.

మళ్లీ పాత విధానంలోనే..


కేంద్రం అనుమతిస్తే మళ్లీ పాత విధానాన్నే అమలుచేయాలని భావిస్తున్నారు కర్ణాటక క్యాబినెట్ మంత్రులు. జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో నీట్ పై చర్చంచి, ప్రతిపక్షాల సూచనలు, సలహాలు కూడా తీసుకుని ముందుకు సాగాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ మాదిరిగానే ఇటీవల తమిళనాడులో కూడా నీట్ రద్దు చేయాలని అధికార డీఎంకే నేత స్టాలిన్ భావిస్తున్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కనుక కర్ణాటక మాదిరిగానే ఇక్కడ కూడా నీట్ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని మంత్రి వర్గం భావిస్తోంది.

Related News

Onam Tragedy: హుషారుగా డ్యాన్స్.. ఒక్కసారిగా ఆగిన గుండె.. కళ్ళముందే కుప్పకూలిన అసెంబ్లీ ఉద్యోగి!

Solar Storm: భూమికి మరో ముప్పు.. ముంచుకోస్తున్న సౌర తుఫాన్..

India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!

NEET Student Incident: మార్కుల ఒత్తిడి.. బిల్డింగ్ పైకి ఎక్కి నీట్ స్టూడెంట్..

September Holidays: సెప్టెంబర్‌లో సగం రోజులు సెలవులే.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..

Big Stories

×