Big Stories

Teamindia: టీమిండియా ఓటమికి కారణాలివే?.. వారి వైఫల్యమే కొంపముంచిందా?

Teamindia : టీ 20 వరల్డ్ కప్ లో భారత్ సెమీస్ లోనే ఇంటికి చేరడానికి కారణాలేంటి? టీమిండియాలో లోపం ఎక్కడుంది? ఓపెనర్ల వైఫల్యమే కొంపముంచిందా? ఈ ప్రశ్నలకు ప్రధానంగా వస్తున్న సమాధానం ఓపెనర్ల వైఫల్యం.

- Advertisement -

ఓపెనర్ల వైఫల్యం
ఏ జట్టైనా భారీ స్కోరు సాధించాలంటే పునాది వేయాల్సిందే ఓపెనర్లే. టీ 20 మ్యాచ్ ల్లో పవర్ ఫ్లే చాలా కీలకం. మొదటి 6 ఓవర్లలో సాధ్యమైనన్ని పరుగులు చేస్తే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అదే జోరును కొనసాగించే అవకాశం కలుగుతోంది. కానీ ఈ వరల్డ్ కప్ లో భారత్ ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నిలకడగా రాణించలేకపోయారు. భారీ భాగ్యస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. చాలా మ్యాచ్ ల్లో ఫవర్ ఫ్లే ముగిసేలోపు పెవిలియన్ చేరారు.

- Advertisement -

రాహుల్ విఫలం
సెమీస్ సహా నాలుగు మ్యాచ్ ల్లో రాహుల్ సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు. రెండు మ్యాచ్ ల్లో జింబాబ్వే, నెదర్లాండ్స్ పై మాత్రమే హాఫ్ సెంచరీలు చేశాడు. కీలక మ్యాచ్ ల్లో అవుట్ కావడం రాహుల్ కు పరిపాటిగా మారింది. 2019 వరల్డ్ కప్ సెమీస్ లో అలాగే అవుట్ అయ్యాడు. కీలక మ్యాచ్ ల్లో రాహుల్ ఒత్తిడి అధిగమించలేకపోతున్నాడు. ఆత్మవిశ్వాసంతో క్రీజులో కదల్లేకపోతున్నాడు. బౌలర్లకు సులభంగా వికెట్ ఇచ్చేస్తున్నాడు. రాహుల్ ఈ బలహీనతను అధిగమించకపోతే ముందుముందు టోర్నీల్లోనూ జట్టుకు ఇబ్బందే. ఈ టీ20 వరల్డ్ కప్ లో రాహుల్ 21. 33 సగటుతో 128 పరుగులు మాత్రమే సాధించాడు.

రోహిత్ శర్మ అదే బాట
కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టీ20 వరల్డ్ కప్ లో బ్యాట్ ను ఝలిపించలేకపోయాడు. కేవలం 6 మ్యాచ్ ల్లో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. కొన్ని మ్యాచ్ ల్లో నిలబడినా ఆ ఇన్సింగ్ లను భారీ స్కోర్ గా మార్చలేకపోయాడు. సెమీస్ లో అదే ప్రదర్శనతో రోహిత్ నిరాశపర్చాడు. మొత్తం ఈ టోర్నిలో రోహిత్ 19.33 సగటుతో 116 పరుగులు మాత్రమే చేశాడు.

ఆ ఇద్దరే మెరిశారు
టాప్ఆర్డర్ లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించారు. కోహ్లీ 4 హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. 6 మ్యాచ్ ల్లో 296 పరుగులు సాధించాడు. 3 మ్యాచ్ ల్లో నాటౌట్ గా నిలిచిన విరాట్ పరుగుల సగటు 98. 66 గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ 3 అర్ధశతకాలు బాదాడు. సూర్య మొత్తం 59.75 సగటుతో 239 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్ లో హార్థిక్ పాండ్యా రెండు కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఆరంభ మ్యాచ్ లో పాకిస్థాన్ పైనా , సెమీస్ లోనూ పాండ్యా అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నిలో పాండ్యా 128 పరుగులు సాధించాడు.

DK ఫ్లాప్ షో
కీపర్ దినేష్ కార్తీక్ 4 మ్యాచ్ ల్లో ఆడినా దారుణంగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్ ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కినా 4.66 సగటుతో 14 పరుగులే చేశాడు. డీకే ఒక మ్యాచ్ లో చేసిన అత్యధిక పరుగులు 7 మాత్రమే. జట్టుకు ఉపయోగపడే ఒక్క ఇన్సింగ్ కూడా ఆడలేకపోయాడు. ఫినిషర్ పాత్రను పోషిస్తాడని టీమ్ మేనేజ్ మెంట్ ఎంతో నమ్మకముంచినా దినేష్ కార్తీక్ అంచనాలను వమ్ము చేశాడు. పంత్ కాదని అవకాశాలిచ్చినా దారుణంగా ఫెయిల్ అయ్యాడు.

బ్యాటింగ్ లోపాలు

ఈ టోర్నిలో బ్యాటింగ్ లో టీమిండియా అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని చేధించడానికి చాలా కష్ట పడింది. అందుకు ఓపెనర్ల వైఫల్యమే కారణమని చెప్పుకోవాలి. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు పడటంతో మిడిల్ బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. వారు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. ప్రతి మ్యాచ్ లో భారత్ జట్టు చేయాల్సిన స్కోర్ కంటే 20, 30 పరుగులు తక్కువే చేసింది. సెమీస్ లో బౌలర్లు పూర్తిగా విఫలమైనా బ్యాటంగ్ వైఫల్యం కూడా భారత్ ను సెమీస్ నుంచి ఇంటిదారి పట్టేలా చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News