BigTV English

Virat Kohli : జెర్సీ నంబర్ 18 .. దీని వెనుక ఉన్న విషాదమేంటి..?

Virat Kohli : జెర్సీ నంబర్ 18 ..  దీని వెనుక ఉన్న విషాదమేంటి..?

Virat Kohli : జెర్సీ నంబర్ 18 అనగానే గుర్తొచ్చే క్రికెటర్ విరాట్ కోహ్లీ. 18వ నంబర్ జెర్సీతో కోహ్లీ మైదానంలో బరిలోకి దిగడానికి చాలా బలమైన కారణం ఉంది. కన్నీళ్లు తెప్పించే విషాద గాథ దీని వెనుక ఉంది. కోహ్లీ 17 ఏళ్లు వయస్సులో ఉండగా 2006 డిసెంబర్ 18న ఢిల్లీ తరఫున కర్ణాటకతో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ రోజు 90 పరుగులు కూడా చేశాడు. కానీ విరాట్ ఆ రోజు బ్యాటింగ్ ప్రారంభించక ముందే తండ్రిని కోల్పోయాడు. ఆ రోజు తెల్లవారు జామున విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆ బాధను పంటిబిగువు ఉంచుకునే కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. ఢిల్లీ జట్టుకు ఎంతో విలువైన 90 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు.


కోహ్లీకి జీవితంలో అత్యంత విషాదరకరమైన రోజు 2006 డిసెంబర్ 18. ఆ రోజుకు గుర్తుగానే కోహ్లీ 18వ నంబర్ జెర్సీ ధరిస్తున్నాడు. తన తండ్రిని కోల్పోయిన రోజు తాను వ్యక్తిగా మారానని కోహ్లీ గతంలో అనేకసార్లు చెప్పాడు. అందుకే ఆ రోజు బ్యాటింగ్ చేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నానని నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు.

అండర్‌ -19 జట్టులో ఉన్నప్పుడు తొలుత కోహ్లీకి జెర్సీ నంబరు 44ను కేటాయించారట. అయితే కొన్నాళ్లకు జెర్సీ నంబరు 18కి మార్చుకున్నాడు. అదే నంబరుతో అండర్‌ -19 జట్టుకు సారథిగా భారత్‌కు ప్రపంచకప్‌ అందించాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ టీమిండియా జట్టులో స్థానం సంపాదించే సమయానికి జెర్సీ నంబర్ 18 ఖాళీగా ఉంది. దీంతో ఎలాంటి సమస్య లేకుండా విరాట్‌కు ఆ నంబర్ దక్కింది. ఇక నాటి నుంచి కోహ్లీ అదే నంబర్ జెర్సీతో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.


ఈ నంబర్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. కోహ్లీ తండ్రి ప్రేమ్‌ తాను క్రికెట్‌ ఆడే రోజుల్లో జెర్సీ నంబర్ 18నే వేసుకునేవారట. ఆయన జ్ఞాపకార్థం కోహ్లీ కూడా ఇప్పటికీ అదే నంబర్ జెర్సీతో కన్పిస్తున్నాడు. కోహ్లీ ఆటలోనే కాదు నిజజీవితంలోనూ చాలా ఎమోషనల్..!

Related News

Asia Cup 2025: ఆసియా కప్ నుంచి గిల్, సిరాజ్ ఔట్… టీమిండియా తుది జట్టు ఇదే !

Samantha: సమంతకు దగ్గరైన టీమిండియా ప్లేయర్.. షాకింగ్ పోస్ట్ వైరల్ !

Nayanthara: ‘నయన్’ ఎ**ఫైర్ లిస్ట్ పెద్దదే..లిస్ట్ లో టీమిండియా సీనియర్ ఆటగాడు ?

WWE Ric Flair: 76 ఏళ్ల వయసులో ఇద్దరు లేడీలతో రొమాన్స్ చేస్తున్న మల్లయోధుడు

Kohli – Anushka: లండన్ వీధుల్లో కోహ్లీ-అనుష్కకు షాక్… ఎవరు పట్టించుకోవడం లేదుగా !

Rinku Singh: రింకు సింగ్ కు దరిద్రంగా మారిన ఆ లేడీ…టీమిండియాలో ఛాన్స్ దక్కడం కష్టమేనా ?

Big Stories

×