Tim Southee Retirement: న్యూజిలాండ్‌కు చెందిన దిగ్గజ సీమ్ బౌలర్ టిమ్ సౌథీ ( Tim Southee ) సంచలన ప్రకటన చేశాడు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు టిమ్ సౌథీ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్ – న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఉంది. ఈ సిరీస్ ముగింపు సందర్భంగా హామిల్టన్‌లోని తన సొంత మైదానంలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ( Retirement )ఇస్తున్నట్లు ప్రకటించాడు న్యూజిలాండ్‌కు చెందిన దిగ్గజ సీమ్ బౌలర్ టిమ్ సౌథీ.
దీంతో తన 18 ఏళ్ల టెస్ట్ కెరీర్ ముగియనుంది. 35 ఏళ్ల న్యూజిలాండ్‌కు చెందిన దిగ్గజ సీమ్ బౌలర్ టిమ్ సౌథీ ( Tim Southee ) ఇప్పటి వరకు 104 మ్యాచ్‌లలో 385 టెస్ట్ వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లలో సర్ రిచర్డ్ హ్యాడ్లీ (431) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు న్యూజిలాండ్‌కు చెందిన దిగ్గజ సీమ్ బౌలర్ టిమ్ సౌథీ ( Tim Southee ).
19 ఏళ్ల యువకుడిగా నేపియర్‌లో ఇంగ్లండ్‌తో అరంగేట్రం చేసిన టిమ్ సౌథీ ( Tim Southee ) కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే… జూన్‌లో లార్డ్స్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత సాధిస్తే అతను అందుబాటులో ఉంటాడని సమాచారం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.