EPAPER

Top 8 : T20 వరల్డ్‌కప్‌లో టాప్ 8 బెస్ట్‌ మ్యాచెస్‌ ఇవే!

Top 8 : T20 వరల్డ్‌కప్‌లో టాప్ 8 బెస్ట్‌ మ్యాచెస్‌ ఇవే!

Top 8 : సంచలనాలకు మారుపేరైన T20 వరల్డ్ కప్ లో… బెస్ట్ మ్యాచ్‌ల లిస్ట్ ను ICC ప్రకటించింది. ఫస్ట్ ప్లేస్ లో సౌతాఫ్రికా-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ ఉండగా… భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఇంగ్లండ్‌-ఐర్లాండ్‌, 4వ ప్లేస్ లో పాకిస్తాన్‌-జింబాబ్వే, ఐదో స్థానంలో బంగ్లాదేశ్‌-జింబాబ్వే, ఆరో స్థానంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్‌, 7వ స్థానంలో ఇండియా-సౌతాఫ్రికా, 8వ ప్లేస్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లు ఉన్నాయి.


క్రికెట్‌లో పసికూనగా చెప్పుకునే నెదర్లాండ్స్‌… సూపర్-12 ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు షాకిచ్చి, ఆ జట్టు సెమీస్‌ చేరకుండా అడ్డుకుంది. దాంతో… దాన్ని బెస్ట్ మ్యాచ్ గా పరిగణించింది… ICC. ఇక ఆఖరి బంతి దాకా సాగిన హైఓల్టేజ్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. 8 బంతుల్లో 28 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించి… దేశం మొత్తం సంబరాలు చేసుకునేలా చేశాడు.. కోహ్లీ. ఈ మ్యాచ్ కు రెండో స్థానం దక్కింది.

ఇక క్వాలిఫయర్‌ దశలో వెస్టిండీస్‌కు షాకిచ్చి సంచలనాలకు తెరతీసిన ఐర్లాండ్‌.. సూపర్‌-12 దశలో వరుణుడు సహకరించడంతో… డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్‌పై గెలిచింది. ఐసీసీ బెస్ట్‌ మ్యాచెస్‌ జాబితాలో ఈ మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. ఇక ఆఖరి బంతి వరకు హైడ్రామా మధ్య సాగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై జింబాబ్వే సంచలన విజయం సాధించి… ఆ జట్టు నైతిక స్థైర్యాన్ని దెబ్బకొట్టింది. వరుసగా రెండు ఓటములతో వరల్డ్ కప్ లో పాక్ సెమీస్ చేరలేదేమో అనిపించిన ఈ మ్యాక్ కు నాలుగో స్థానం దక్కింది.


అనూహ్య మలుపులు తిరుగుతూ ఆఖరి బంతి దాకా సాగిన బంగ్లాదేశ్‌-జింబాబ్వే మ్యాచ్‌కు… ICC ఐదో స్థానాన్ని కట్టబెట్టింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో తడబడ్డ జింబాబ్వే… మరో సంచలన విజయం సాధించే అవకాశాన్ని పోగొట్టుకుంది. ఇక మరో మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించినంత పని చేసింది… ఆప్ఘనిస్తాన్. ఈ మ్యాచ్ ఆరో స్థానం దక్కించుకుంది. ఇక ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన భారత్‌-సౌతాఫ్రికా మ్యాచ్‌కు ఏడో స్థానం లభించింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఈ మ్యాచ్‌లో చివరిదాకా పోరాడింది… టీమిండియా. సూపర్‌-12లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఏకపక్షంగా సాగిన ఫస్ట్ మ్యాచ్‌కు జాబితాలో 8వ స్థానం దక్కింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లు దంచికొట్టడంతో… ఆ మ్యాచ్ ఫ్యాన్స్‌కు ఎంతో మజా అందించింది.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×