Chahal Dhanashree Divorce: టీమ్ ఇండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ లు వారి ఐదు సంవత్సరాల వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు. తాజాగా ఈ జంటకి బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్న కారణంగా ఆరు నెలల కూలింగ్ పీరియడ్ ని బాంబే హైకోర్టు రద్దు చేసిందని చాహాల్ తరపు న్యాయవాది నితీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
Also Read: Kohli IPL Salary: 12 లక్షల నుంచి 21 కోట్లకు.. శభాష్ కోహ్లీ ?
ఈనెల 20 వ తేదీలోగా విడాకుల పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్ట్.. ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. అయితే భరణం కింద చాహల్ నుండి ధనశ్రీ రూ. 4.75 కోట్లు అందుకోనున్నారు. ఈ భరణం లో భాగంగా చాహల్ ఇప్పటికే ధనశ్రీకి 2.37 కోట్లు చెల్లించారు. కోర్టు డిక్రీ అందిన అనంతరం మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని చాహల్ తరపు న్యాయవాది తెలిపారు. ఈ స్టార్ కపుల్ 2020 డిసెంబర్ 22న వివాహం చేసుకున్నారు.
అయితే గత మూడున్నర ఏళ్లుగా వీరు విడివిడిగా ఉంటున్నారు. పెళ్లి జరిగిన ఏడాదిన్నరకే.. అంటే 2022 జూన్ లోనే వీరిద్దరూ విడిపోయినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ధనశ్రీ ఫెమ్ కోసమే చాహల్ ని వివాహం చేసుకొని వాడుకుందని కొంతమంది కామెంట్స్ చేస్తుండగా.. మరి కొంతమంది మాత్రం ఆమె ఎలాంటి తప్పు చేయలేదని సపోర్ట్ చేస్తున్నారు.
అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 5న తమ విడాకుల కోసం వీరు ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం సర్దుబాటు కోసం ప్రయత్నించేందుకు వీలుగా కనీసం ఆరు నెలల సమయం ఇస్తారు. దీన్నే “కూలింగ్ ఆఫ్ పీరియడ్” గా చెబుతారు. అయితే తాము పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకుంటున్నాం కాబట్టి కూలింగ్ ఆఫ్ పీరియడ్ ని తొలగించి వెంటనే విడాకులు మంజూరు చేయాలని ఈ జంట కోరింది.
ఈ విజ్ఞప్తిని ఫ్యామిలీ కోర్టు కొట్టేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎల్ కారణంగా తాను కనీసం మూడు నెలల పాటు అందుబాటులో ఉండలేనని చాహల్ కూడా వెల్లడించాడు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ నిబంధననుండి వీరిద్దరికీ సడలింపు ఇవ్వాలని ఆదేశించడంతోపాటు, గురువారమే తుది తీర్పు వెల్లడించాలని సూచించింది. దీంతో ఈ జంటకు విడాకులు మంజూరయ్యాయి.
అయితే గురువారం రోజు విడాకుల కోసం ఈ జంట కోర్టుకు చేరుకున్నారు. అయితే చాహల్ కోర్టుకి వచ్చినప్పుడు ధరించిన టీ షర్ట్ పై “బి యువర్ ఓన్ షుగర్ డాడీ” అని ఉండడం అందరినీ ఆకర్షించింది. అంటే ఎవరో ఇచ్చే డబ్బులపైన, బహుమతులపైన ఆధారపడకుండా.. నీ కాళ్లపై నువ్వు నిలబడు, నీ బాగోగులు నువ్వే చూసుకో అని దీని అర్థం. ఈ క్రమంలో ధనశ్రీ మనసత్వాన్ని ఉద్దేశించి చాహల్ ఈ విధంగా ఆ టీషర్టు ధరించి వచ్చాడని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.