BigTV English

Spirit : రెబల్స్ కు గుడ్ న్యూస్… ‘స్పిరిట్’ లాంచ్ కు ఆ పండగ రోజే ముహూర్తం ఫిక్స్ చేసిన సందీప్ వంగా

Spirit : రెబల్స్ కు గుడ్ న్యూస్… ‘స్పిరిట్’ లాంచ్ కు ఆ పండగ రోజే ముహూర్తం ఫిక్స్ చేసిన సందీప్ వంగా

Spirit : ప్రభాస్ (Pabhas) ఖాతాలో మరే ఇతర హీరోలకు లేనటు వంటి క్రేజీ లైనప్ ఉంది. వాటిలో మోస్ట్ అవైటింగ్ సినిమా అనగానే గుర్తొచ్చేది సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit). ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ప్రకారం సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ లాంచ్ కు తెలుగు వారికి ప్రత్యేకమైన ఓ పండగ రోజున ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి ఏ పండగ రోజు సందీప్ రెడ్డి ఈ మూవీ ని లాంచ్ చేయబోతున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే….


‘స్పిరిట్’ మూవీ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ 

ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న రూమర్ల ప్రకారం ఉగాది శుభ సందర్భంగా ‘స్పిరిట్’ మూవీ అఫీషియల్ గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడని, ప్రొడక్షన్ సాఫీగా సాగడానికి ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించడం మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రానప్పటికీ, రెబల్స్ మాత్రం ఈ న్యూస్ తో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడికల్ వార్ మూవీ ‘ఫౌజీ’తో పాటు మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్స’ అనే కామెడీ హర్రర్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇక మరోవైపు ప్రభాస్ సెట్ లో జాయిన్ అయ్యేలోపు ‘స్పిరిట్’ మూవీకి సంబంధించిన మ్యూజికల్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ‘స్పిరిట్’ మూవీని భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

‘స్పిరిట్’లో ప్రభాస్ హీరోయిన్ రిపీట్ ?

ఇదిలా ఉండగా మరో వైపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిపోతున్న ‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్ హీరోయిన్ ఫిక్స్ అయిందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై చాలా కాలంగా చర్చ నడుస్తోంది. ఈ లిస్టులో ఇప్పటికే మృణాల్ ఠాకూర్ తో పాటు కియారా అద్వానీ, త్రిషల పేర్లు వినిపించాయి. కానీ తాజాగా వీళ్ళందర్నీ పక్కన పెట్టి మరో క్రేజీ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ‘కల్కి’ మూవీలో ప్రభాస్ తో కలిసి నటించిన దీపికా పదుకొనే ‘స్పిరిట్’లో  ప్రభాస్ తో మరోసారి జోడి కట్టబోతోందని అంటున్నారు. ఇక ఇందులో దీపిక గృహిణి పాత్రలో సరికొత్తగా కనిపించబోతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ ఈ మూవీలో మూడు డిఫరెంట్ రోల్స్ లో దర్శనం ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. మరి మూవీ లాంచ్ డేట్ గురించి శుభ వార్తను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎప్పుడు డార్లింగ్స్ కోసం అనౌన్స్ చేస్తాడో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×