BigTV English
Advertisement

Vamana Guntalu: కెన్యాలో ప్రాచీన వామన గుంటలు..

Vamana Guntalu: కెన్యాలో ప్రాచీన వామన గుంటలు..
Vamana Guntalu

Vamana Guntala Pita: వామన గుంటలు తెలుసా..? అతి పురాతనమైన ఈ ఆటను సీతమ్మవారు ఆడినట్టుగా పెద్దలు చెబుతుంటారు. అష్టా-చెమ్మ, పులి-మేక, పచ్చీస్ పాళీ, వైకుంఠపాళిగా ఇది కూడా పీట ఆట కోవకు చెందినదే. అయితే ఈ ఆటలన్నీ కొయ్యతో తయారు చేసిన పెట్టెలాంటి పీటపై ఆడతారు. వామనగుంటలు తరహాలోనే రాతిపై చెక్కిన గేమ్ బోర్డు తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో బయటపడింది. అలాంటి గేమ్ బోర్డ్‌లతో కూడిన అతి పురాతన ఆర్కేడ్‌ను యేల్‌కు చెందిన పురావస్తు శాఖ పరిశోధకు‌రాలు వెరోనికా వావేరు కనుగొన్నారు.


ఇద్దరు ఆడే ఈ గేమ్ బోర్డును మాంకాల రకానికి చెందినదిగా భావిస్తున్నారు. దాని కోసమే రాతిపై చెక్కిన గుంతలను వినియోగించి ఉంటారని పరిశోధనకు నేతృత్వం
వహించిన వెరోనికా చెబుతున్నారు. ఈ తరహా ఆటలను చిన్న రాళ్లు, గోళీలు, గింజలు, బీన్స్ సాయంతో ఆడటం సర్వసాధారణం. మనమైతే చింతపిక్కలను వినియోగిస్తాం.

మాంకాల రకం ఆటల మూలాలు వేల సంవత్సరాల క్రితం నాటివనే విషయం ఈజిప్టు, ఆఫ్రికాల్లోని వివిధ పురావస్తు ప్రదేశాల్లో బయటపడింది. కెన్యాలో మంకాలా(Mancala) శైలికి చెందిన 20 రకాల గేమ్ బోర్డులను వెరోనికా గుర్తించారు. రాళ్లు సులువుగా పట్టే
విధంగా కొన్ని గుంటలను రాతిపొరల్లోకి చాలా లోతుగా చెక్కారని వివరించారు. వీటిలో కొన్ని గుంటలు చాలా పురాతనమైనవి రిసెర్చర్లు తెలిపారు.


బోర్డుల కోత కారణంగా ఎప్పుడో ప్రాచీనకాలంలో ఈ ఆటలు ఆడినట్టుగా వెరోనికా
భావిస్తున్నారు. మాంకాల తరహా గేమ్ బోర్డులు ఎంత కాలం క్రితం
ఆవిర్భవించాయో ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంది. కెన్యా సైట్ ఎత్తైన
ప్రాంతాలతో చుట్టుముట్టిన లోతట్టు బేసిన్‌లో ఉంది. ఇక్కడ నిత్యం నీరు
ప్రవహిస్తూ ఉంటుంది. ఆదిమానవులు ఇక్కడ సంచరించానడానికి ఇదొక కారణం.
పదివేల ఏళ్లకు పూర్వం ఈ సైట్ సమీప ప్రాంతంలో మాంకాల గేమ్‌లు
ఆడారని చెప్పడానికి తాజాగా బయటపడిన చెక్కడాలుచెబుతున్నాయి.

Tags

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×