BigTV English

T20 Womens World Cup: అండర్ 19 టీ20 2025 మహిళల ప్రపంచకప్ షెడ్యూల్‌ విడుదల

T20 Womens World Cup: అండర్ 19 టీ20 2025 మహిళల ప్రపంచకప్ షెడ్యూల్‌ విడుదల

Under 19 T20 2025 Women’s World Cup Schedule Released: అండర్ 19 టీ20 మహిళల ప్రపంచకప్ షెడ్యూల్‌ని రిలీజ్ అయింది. మలేషియా వేదికగా 2025 ఏడాదిలో జరగనున్న ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఆదివారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఓ ప్రకటన ద్వారా విడుదల చేసింది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి ఈ పోటీలో తలపడనున్నాయి. ఇందులో గ్రూప్-ఏలో ఇండియా, విండీస్, శ్రీలంక, మలేసియా వంటి దేశాలు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి.


గ్రూప్-బి లో ఇంగ్లండ్, పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా వంటి దేశాలు తలపడనున్నాయి. ఇక గ్రూప్-సీలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫైయర్, సమోవాలు ఉన్నాయి. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆసియా క్వాలిఫైయర్, స్కాట్లాండ్‌లు ఉన్నాయి.కాగా.. ఈ మెగా టోర్నీలో జనవరి 18 నుంచి 24 గ్రూప్ దశ, 25 నుంచి 29 వరకు సూపర్ సిక్స్, 31న రెండు సెమీ ఫైనల్స్ ఫిబ్రవరి 1 రిజర్వ్ డే, ఫిబ్రవరి 2న ఫైనల్ మ్యాచ్ 3న రిజర్వ్ డే జరగనున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: కొత్త వివాదంలో చిక్కుకున్న బజరంగ్ పూనియా, నెటిజన్లు ఫైర్‌..


డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియా తన తొలి మ్యాచ్ లో జనవరి 19న వెస్టిండీస్‌తో బరిలోకి దిగి తలపడనుంది. అంతేకాదు ఈ మ్యాచ్ ద్వారా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్లేయర్స్‌కి ఇదొక సువర్ణ అవకాశమనే చెప్పాలి. భారత్ ఈ ఏడాదిలో అనూహ్యంగా రాణించింది. అంతేకాకుండా ఇందులో టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్ నేతృత్వంలో జరగనుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌ బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది. ఢాకా, సిల్​హెట్ స్టేడియాల్లో ఈ మ్యాచ్​లు జరిగాయి. ఇక 2025 ఏడాది జరగబోయే క్రీడలకు అతిథ్యం ఏ దేశం ఇవ్వబోతుందనేది త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×