BigTV English

Bulandshahr Accident: ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది స్పాట్ డెడ్

Bulandshahr Accident: ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది స్పాట్ డెడ్

Bulandshahr Accident: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బులంద్ షహర్ జిల్లాలో బస్సు.. వ్యాను ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా..మరో 27మందికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.


బుదాన్ మీరట్ రాష్ట్ర రహదారిపై ఆదివారం సేలంపూర్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న బస్సును వ్యాన్ ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన 40 మంది పికప్ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి అలీగడ్ వెళ్తున్నారు. వీరంతా బులంద్షపూర్ రోడ్డ వద్ద ఒక ఫుడ్ కంపెనీ పనిచేస్తున్నారు. ఆదివారం వీరు పికప్ వ్యాన్ లో తమ ఇళ్ల నుంచి బయలుదేరారు. సేలంపూర్ దగ్గరగా బస్సు  పికప్ వ్యాన్ ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Also Read: షేక్ హసీనా పరిస్థితే మోదీకి రాబోతోందా? ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, మృతులంతా అలీఘర్ జిల్లాలోని అత్రౌలీ తహసీల్‌లోని రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×