BigTV English

US Open 2024 final: యూఎస్ ఓపెన్.. సిన్నర్ దే టైటిల్, ఓపెనింగ్.. ఎండింగ్ అదుర్స్..

US Open 2024 final: యూఎస్ ఓపెన్.. సిన్నర్ దే టైటిల్, ఓపెనింగ్.. ఎండింగ్ అదుర్స్..

US Open 2024 final: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఇటలీ ఆటగాడు జానిక్ సిన్నర్ టైటిల్ ఎగురేసుకుపోయాడు. ఫైనల్‌లో అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌పై గెలిచారు. స్పెయిన్ యవ కెరటం అల్కరాస్ సరసన నిలిచాడు సిన్నర్. భవిష్యత్తులో వీరిద్దరు కొన్నేళ్లు టెన్నిస్‌ను శాసించే అవకాశమున్నట్లు టెన్నిస్ నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.


23 ఏళ్ల ఇటలీ టెన్నిస్ ఆటగాడు జానిక్ సిన్నర్ ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ కప్ గెలుచుకోగా, తాజాగా యూఎస్ ఓపెన్ టైటిల్‌ వంతైంది.

ALSO READ: ఏడు దేశాలపై ఏడు సెంచరీలు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో రికార్డ్


మరోవైపు 21 ఏళ్ల స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాస్ కూడా ఈ ఏడాది రెండు టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఫ్రెంచ్ కాగా మరొకటి వింబుల్డన్ టైటిళ్లను దక్కించు కున్నారు. ఫ్యూచర్‌లో మరో దశాబ్దం వరకు వీరిద్దరిదే ఆధిపత్యం కావచ్చని టెన్నిస్ నిఫుణుల అంచనా.

యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌కు విషయానికొద్దాం. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో రెండు గంటలకు పైగా మ్యాచ్ సాగింది. ఫైనల్లో ఇటలీ ఆటగాడు జానిక్ సిన్నర్- అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్ టైటిల్ కోసం తలపడ్డారు. ఇరువురు ఆటగాళ్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న అభిమానులు భావించారు. కాకపోతే సిన్నర్ దూకుడు ముందు టేలర్ తేలిపోయాడు.

తొలిసెట్‌ను సునాయాశంగా గెలుచుకున్న సిన్నర్, రెండో సెట్‌ ఆసక్తిగా సాగింది. కాకపోతే సిన్నర్ దూకుడు ముందు టేలర్ తడబడ్డాడు. దీంతో మూడో సెట్ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. చివరి సెట్‌ను టేలర్ గెలుచుకోవాలని తెగ ప్రయత్నాలు చేశాడు. కానీ, సిన్నర్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేసిన స్నినర్, మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నాడు. దీంతో మూడు సెట్లను 6-3, 6-4, 7-5 తేడాతో టేలర్‌పై గెలిచాడు. టైటిల్ ను సొంతం చేసుకున్నారు.

టేలర్ పది బలమైన సర్వీస్‌లు సంధించగా, సిన్నర్ కేవలం ఆరింటితో మాత్రమే సరిపెట్టుకున్నాడు. టేలర్ అనవసర తప్పిదాలు నాలుగు చేయగా, సిన్నర్ ఐదు తప్పిదాలకు పాల్పడ్డాడు. కాకపోతే ఫస్ట్, సెకండ్ సర్వీస్‌ల్లో పాయింట్ రాబట్టుకోవడంలో టేలర్ వెనుకబడిపోయాడు. దాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నాడు సిన్నర్.

ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లు జరగ్గా.. రెండింటిని సిన్నర్ గెలుచుకున్నాడు. ఒకటి ఆస్ట్రేలియా, మరొకటి యూఎస్ ఓపెన్. అయితే ఈ టోర్నీకి ముందు డోపింగ్ టెస్టులో సిన్నర్ ఇబ్బందుల్లో పడినట్టు వార్తలు వచ్చాయి. వాటిని అధిగమించారు. ఓపెనింగ్.. ఎండింగ్.. అదుర్స్ అనిపించేలా చేశాడు. టైటిల్‌ను టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ చేతుల మీదుగా అందుకున్నాడు సిన్నర్.

 

 

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×