BigTV English

Pakistan Cricket Team : ఉస్మాన్ ముందు మాటాడొద్దు రా బాబూ : పాక్ నిర్ణయం

Pakistan Cricket Team : ఉస్మాన్ ముందు మాటాడొద్దు రా బాబూ : పాక్ నిర్ణయం

Pakistan Cricket Team : ఏమిటి? విచిత్రం అనుకుంటున్నారా? పాకిస్తాన్ ఎందుకు ఉస్మాన్ గురించి భయపడుతోందని అనుకుంటున్నారా? అసలు ఉస్మాన్ ఎవరని ఆలోచిస్తున్నారా? అతనెవరో కాదండీ బాబూ…చాలా కాలం పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో ఉన్నాడు. అందుకని తనకి ఉర్దూ బాగా తెలుసు.


ఈ క్రమంలో పాక్ జట్టుకి ఆడుదామనుకుంటే కాంపిటేషన్ చూసి ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ వాళ్లు గుర్తించి జాతీయ జట్టుకి సెలక్ట్ చేశారు. ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ ల్లో ఆడుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. మరెందుకు ఉస్మాన్ అంటే పాకిస్తాన్ భయపడుతోందనంటే, తను ఆటలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉర్దూలో మాట్లాడేవన్నీ వినేస్తున్నాడంట. వెంటనే వారి గేమ్ ప్లాన్ అంతా టీమ్ కి చెప్పేస్తున్నాడు. దాంతో వాళ్లు ముందుగానే వీరికి ముకుతాడు వేస్తున్నారు.

వారి ప్లాన్ తెలిసింది కాబట్టి, ఫస్ట్ డౌన్ పంపే బ్యాటర్ ని తర్వాత పంపిస్తున్నారు. అప్పటివరకు అతన్నెలా అవుట్ చేయాలని పాక్ స్కెచ్ వేసుకుంటోంది. తను వస్తాడని చూస్తే వేరేవాడొస్తున్నాడు. దాంతో దెబ్బతింటున్నారు. 2023 లో పాకిస్తాన్ -ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాక్ క్రికెటర్లు ఉర్దూలో మాట్లాడుకుంటూ రహస్యంగా వేసుకున్న స్కెచ్‌ను ఉస్మాన్ పసిగట్టి లీక్ చేశాడని భావిస్తున్నారు.


ఇంటి గుట్టు లంకకి చేటు అన్నట్టు, తమవాడే కొంపకి నిప్పంటేంచేస్తున్నాడని పాక్ జట్టు సభ్యులు తెలుసుకున్నారు. అప్పటి నుంచి ఉస్మాన్ క్రీజులో బ్యాటింగ్ చేస్తుంటే అతని ముందు మాట్లాడుకోవద్దని డిసైడ్ అయ్యారంట. ఒకవేళ మాట్లాడాలంటే, అతనికి దూరంగా వెళ్లి మాట్లాడుకోవాలని భావిస్తున్నారు.

ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ టూర్ ఆస్ట్రేలియాతో జరగనుంది.  ఆల్రడీ అక్కడికెళ్లిన పాకిస్తాన్ ఉస్మాన్ ని చూసి ఉలిక్కి పడింది. ఈడున్నాడేంట్రా బాబూ, జేమ్స్ బాండ్ లా అన్నీ చూసి పట్టేస్తున్నాడని కంగారు పడుతున్నారు. భయపడుతున్నారు. మొత్తానికి తమ దేశస్తుడే ఇలా పక్కలో బల్లెంలా మారుతాడని వారు ఊహించలేదని ఘోల్లుమంటున్నారు.

డిసెంబర్ 14 నుంచి ఆస్ట్రేలియా – పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలోని కాన్‌బెరాకు పాకిస్తాన్ జట్టు చేరుకుంది. ఆస్ట్రేలియా పీఎం ఎలెవెన్‌తో 4 రోజుల ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది.

Related News

Women’s ODI World Cup : మహిళల ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా డామినేట్.. ఈ లెక్కలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

Big Stories

×