Aakash Chopra On Vaibhav IPL Acution: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెట్ నేపథ్యంలో యూఏఈపై డబుల్ సెంచరీ నమోదు చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై (Vaibhav Sooryavanshi) భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ( Aakash Chopra) సంచలన వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో ఐపీఎల్ వేలంలోకి వైభవ్ వస్తే రూ.40 కోట్లు పలుకుతాడని అంచనా వేశాడు. రిటైన్షన్ లోనైనా అతనిపై కోట్ల వర్షం కురుస్తుందని జోష్యం చెప్పాడు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపమే మార్చేసే ఘనుడు వైభవ్ సూర్యవంశీ అంటూ మెచ్చుకున్నాడు. వైభవ్ ను ఎదుర్కొవాలంటే ప్రత్యర్థ బౌలర్లకు గుండె ధైర్యం ఉంటాడని తెలిపాడు. కనీసం 20 బంతులు ఆడే వరకు వైభవ్ క్రీజులో ఉంటే, 100కు పైగా పరుగులు అవలీలగా వస్తాయని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో వైభవ్ సూర్యవంశీపై ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.