Motorcycle Man stunning one-handed catch: క్రికెట్ అంటేనే మంచి ఎంటర్టైన్ మెంట్ గేమ్. ఈ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు చాలా వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో భయంకరమైన సంఘటనలతో పాటు ఫన్నీ ఇన్సిడెంట్లు కూడా జరిగాయి. భారీ సిక్సర్లు.. సెంచరీలే మీద సెంచరీలు.. అదే సమయంలో స్టన్నింగ్ క్యాచులు క్రికెట్ లో వైరల్ అవుతూ ఉంటాయి. లేటెస్ట్ గా మైదానం నుంచి బయటకు వెళ్లిన ఓ బంతిని బైక్ వెళుతున్న ఓ వ్యక్తి అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు. ఆ తర్వాత బంతిని వెనక్కి ఇవ్వకుండా పట్టుకొని పారిపోయాడు. ఈ సంఘటన స్వాట్ ప్రీమియర్ లీగ్ (Swat Premier League) సీజన్ 8 సందర్భంగా చోటు చేసుకుంది. దీంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.
స్వాట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 8 ( Swat Premier League 2026) ఉత్కంఠ భరితంగా సాగుతోంది. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ స్పాట్ లోయలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. పది ఓవర్ల పాటు సాగే ఈ టోర్నమెంట్ లో భాగంగా తాజాగా స్వాట్ స్ట్రైకర్స్ వర్సెస్ జీకేఆర్ దీర్ జట్ల మధ్య ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా జీకేఆర్ దీర్ బ్యాటర్ ఖాన్….స్వాట్ స్ట్రైకర్స్ బౌలర్ జైన్ బౌలింగ్ లో భారీ సిక్సర్ బాదాడు. దీంతో మైదానం బయటకు వెళ్లిన బంతిని రోడ్డుపై వెళ్తున్న ఓ బైకర్ సింగిల్ హ్యాండ్ తో అందుకున్నాడు. బంతి చేతిలో పడగానే వెనక్కి ఇవ్వకుండా టూ వీలర్ పైన పారిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ వెధవలందరూ ఇలాగే ఉంటారని.. అద్భుతమైన క్యాచ్ పట్టినప్పటికీ బంతి వెనక్కి ఇవ్వకుండా దొంగిలించారని సెటైర్లు పేల్చుతున్నారు.
స్వాట్ స్ట్రైకర్స్ వర్సెస్ జికేఆర్ దీర్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన స్వాట్ స్ట్రైకర్స్ జట్టు నిర్మిత పది ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో జీకేఆర్ దీర్ జట్టు దారుణంగా విఫలమైంది. 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఈ క్రమంలో జీకేఆర్ దీర్ జట్టుపై స్పాట్ స్ట్రైకర్స్ 34 లో తేడాతో బిగ్ విక్టరీ అందుతుంది.
One of the Greatest Catches in Cricket History! 📷📷 pic.twitter.com/gC7cK4IJFz
— Faheem Tak (@FaheemTak) November 25, 2026