E-Paper
Advertisement

ఎల్‌నినో ఎఫెక్ట్.. 15 నెలల సన్నబియ్యం బఫర్ స్టాక్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

ఎల్‌నినో ఎఫెక్ట్.. 15 నెలల సన్నబియ్యం బఫర్ స్టాక్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
Advertisement

Rice Buffer Stock: స్వేచ్ఛ బ్యూరో: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఆహార భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి ఎన్‌. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌), ఇతర సంస్థాగత అవసరాలకు కనీసం 15 నెలల పాటు సరిపడా సన్నబియ్యం నిల్వలను సిద్ధం చేయాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ, కార్పొరేషన్‌ పనితీరుపై కమిషనర్‌ వై. నాగిరెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జి.వి. శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌, అదనపు డైరెక్టర్‌ రోహిత్‌ సింగ్‌ తదితర ఉన్నతాధికారులతో బుధవారం మంత్రి సమీక్ష నిర్వహించారు.

మంత్రి మాట్లాడుతూ..

Advertisement

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 14 నెలలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ఉన్నప్పటికీ, రానున్న వ్యవసాయ సీజన్లలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున మరో నెలకు సరిపడా అదనపు బఫర్‌ స్టాక్‌ ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియను తగ్గించకుండా కొనసాగించాలని, సన్న రకాల ధాన్యం సేకరణను గరిష్ఠ స్థాయికి పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ సన్నబియ్యం పథకానికి నిరంతరాయంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 7 రకాల సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ వర్తిస్తుందనే విషయాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు.

ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ

Advertisement

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అదనపు నిత్యావసర సరుకులు అందించేందుకు ఆర్థికంగా సాధ్యమయ్యే పలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి రేషన్‌ ద్వారా అందించే సరుకుల జాబితాను విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రతిపాదనలు ముందుంచనున్నట్లు వెల్లడించారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఆధునిక సైలో సముదాయాలను ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి, సేకరణ గణనీయంగా పెరిగినప్పటికీ, అందుకు అనుగుణంగా నిల్వ సదుపాయాలు అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. దీంతో ప్రతి సీజన్‌లో ప్రైవేటు రైస్‌ మిల్లర్లపై ఆధారపడాల్సి వస్తోందన్నారు.

సైలోల నిర్మాణానికి చర్యలకు ఆదేశాలు..

కార్పొరేషన్‌కు సొంత నిల్వ సదుపాయాలు ఉంటే నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు ప్రజాధనానికి భద్రత కలుగుతుందని వివరించారు. సైలోల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సైలోల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో అంతర్గత వనరులతో పాటు సంస్థాగత రుణాల అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. సాధ్యమైనంత తక్కువ వడ్డీ రేటుతో, ఎక్కువ కాలపరిమితి కలిగిన రుణాలు పొందేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి బకాయిపడిన రైస్‌ మిల్లర్ల నుంచి వసూళ్ల ప్రక్రియలో ఎలాంటి సడలింపు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని పరిరక్షించేందుకు బకాయిల వసూళ్లను క్రమబద్ధంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. బకాయిల చెల్లింపుపై మిల్లర్లకు వారి బాధ్యతలను గుర్తుచేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మరింత పటిష్టమైన ఆర్థిక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

Also Read: జగనే కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు.. వైసీపీ నేతలు తెలుసుకోవాలి: విజయసాయిరెడ్డి

Tags

Related News

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ వేలంలో కీలక మలుపు.. హైకోర్టు మెట్లు ఎక్కిన వివాదం!

వేల ఎకరాలు అమ్ముకున్న మీరా.. ఇప్పుడు మాట్లాడేది? బీఆర్ఎస్‌పై అద్దంకి ఫైర్

హైదరాబాద్ దాహార్తికి చెక్.. మల్లన్నసాగర్ నీళ్లు వచ్చేశాయ్!

OLXలో సోఫా అమ్మకానికి పెట్టిన మహిళ.. QR కోడ్‌తో రూ.12 లక్షలు స్వాహా!

డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్!

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు గుడ్ న్యూస్.. 10వ తరగతి వరకు ఉచిత విద్య, అప్లై చేసుకోండిలా!

పదో తరగతి మెమోలో తప్పులా? విద్యార్థులకు ఇకపై నో టెన్షన్, మీ సేవలో అప్లయ్ చేస్తే చాలు

Big Stories

Advertisement
×