Vaibhav Sooryavanshi coach Manish Ojha: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) భాగంగా యూఏఈపై 15 ఏళ్ల కుర్రాడు వైభన్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi Double Century) డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 52 బంతుల్లోనే 28 సిక్సర్లు బాదిన వైభవ్ సూర్యవంశీ.. డబుల్ సెంచరీ సాధించడమే కాకుండా ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. దీంతో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక లేటెస్ట్ గా వైభవ్ చేసిన డబుల్ సెంచరీపై అతడి చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా (Vaibhav Sooryavanshi coach Manish Ojha) స్పందించాడు.
తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ అంటూ వ్యాఖ్యానించాడు. క్రిస్ గేల్ కంటే భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడని కొనియాడాడు. ఇది తనకు చాలా ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ చేస్తాడని తాను ఎప్పుడో ఊహించినట్టు గుర్తు చేశాడు. అంతేకాదు ఏదో ఒక రోజు వన్డేల్లోనే ట్రిపుల్ సెంచరీ కూడా చేస్తాడని, తనకు ఆ నమ్మకం ఉందని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటాడని చెప్పుకొచ్చాడు. వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు కూడా రికార్డుల కోసం ఆడబోడని.. కేవలం బంతిని బలంగా బాది సిక్సర్ పంపించడంపైన మాత్రమే ఫోకస్ చేస్తాడని కోచ్ మనీశ్ ఓజా వెల్లడించారు.
వైభవ్ సూర్యవంశీ వన్డేల్లో ఆడితే బాగుంటుందని చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా వెల్లడించాడు. వన్డేలకు పూర్వ వైభవం రావాలంటే ఖచ్చితంగా ఓపెనర్ గా వైభవ్ సూర్యవంశీ బరిలోకి దించాలని కోరాడు. అప్పుడే వన్డేల ప్రాముఖ్యత పెరుగుతుందని పేర్కొన్నాడు. ఇన్ని రోజులు ఐపీఎల్ లో మాత్రమే వైభవ్ సూర్యవంశీ భయంకరమైన బ్యాటింగ్ ఆడడం అందరు చూశారని… లేటెస్ట్ గా అండర్ 19 తరుపున వన్డేలు కూడా ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే 50 ఓవర్ల మ్యాచ్ లోను డబుల్ సెంచరీ చేసి తన సత్తా చాటినట్టు కొనియాడాడు. ఇలాగే వైభవ్ సూర్యవంశీ ముందుకు సాగితే.. రోహిత్ శర్మ స్థానంలో స్థానం దక్కించుకుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి నుంచి అతన్ని వన్డేలు ఆడిస్తే.. మరో 10 ఏళ్ల పాటు టీమిండియాలో పాతుకు పోతాడని స్పష్టం చేశాడు.