Tanveer Ahmed On Vaibhav Sooryavanshi Double Century: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోశాడు. డబుల్ సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. లిస్టు ఏ క్రికెట్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన వైభవ సూర్య వంశీ బ్యాటింగ్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే… పాకిస్తాన్ మాజీలు మాత్రం అతని ప్రదర్శన పై కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇక పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) కూడా వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీపై సెటైర్లు పేల్చాడు.
15 ఏళ్ల వయసులో పిల్లలకు మాటలే సరిగ్గా రావని.. అలాంటిది వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ (Vaibhav Sooryavanshi Double Century) చేస్తాడా ? ఇదంతా ఫేక్ అంటూ బాంబు పేల్చాడు. వైభవ్ సూర్యవంశీ వయస్సు 15 సంవత్సరాలు కాదని.. వాడు భూమి పుట్టినప్పుడు పుట్టాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కనీసం వైభవ్ సూర్యవంశీ వయస్సు 25 సంవత్సరాలు ఉంటుందని.. ఆ ఏజ్ వాళ్లు మాత్రమే ఇలాంటి సిక్సులు, బౌండరీలు బాదుతారని తెలిపారు. దీనిపై ఐసీసీ వెంటనే విచారణ చేపట్టి బౌలర్లను కాపాడాలని డిమాండ్ చేశారు.
15 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ సాధించడం ఎవరి వల్ల కాదని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) హాట్ కామెంట్స్ చేశాడు. దోహా లాంటి కఠినమైన మైదానంలో ఇంత స్కోర్ చేయడం మంచి రికార్డే.. కానీ వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ పైన తనకు అనుమానాలు ఉన్నాయని బాంబు పేల్చాడు. వైభవ్ సూర్యవంశీ వయస్సు 25 సంవత్సరాలని తను ముందు నుంచి చెబుతున్నట్టు గుర్తు చేశాడు. 15 ఏళ్ల వయసులో అంత భయంకరమైన సిక్సర్లు కొట్టడం అసాధ్యమన్నాడు. అంతేకాదు వైభవ్ సూర్యవంశీ వినియోగించే బ్యాట్లలో కూడా ఏఐ చిప్పులు ఉన్నాయని దానిపైన కూడా ఐసీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాట్లలో ఏదో మతలాబు ఉందని అందుకే భారీ స్కోరు రాబట్టినట్టు ఆరోపించాడు.
యూఏఈ, నేపాల్ లాంటి చిన్న జట్లపైన ఇరగదీయడం కాదు.. దమ్ముంటే పాకిస్తాన్ పైన వైభవ్ సూర్యవంశీ ఆడాలని సవాల్ విసిరాడు తన్వీర్ అహ్మద్. ఇప్పటి వరకు పాకిస్తాన్ పై వైభవ్ సూర్యవంశీ సరిగ్గా ఆడిన దాఖలాలే లేవని పరువు తీశాడు. పాకిస్తాన్ లాంటి సరైన బౌలర్లు తగిలితే.. వైభవ్ కెరీర్ అంతమవుతుందని హెచ్చరించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ఫైనల్స్ సందర్భంగా కచ్చితంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే ఛాన్సులు ఉన్నాయని.. ఆ సందర్భంగా వైభవ్ డబుల్ సెంచరీ కాదు అర్థ సెంచరీ చేసిన బట్టలు లేకుండా తాను తిరుగుతానని చాలెంజ్ విసిరాడు.