Shahid Hashmi On Vaibhav Sooryavanshi Double Century: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) నేపథ్యంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi Double Century ) డబుల్ సెంచరీ బాదేశాడు. పసికూన యూఏఈపై 52 బంతుల్లోనే 200 బాదిన వైభవ్ సూర్యవంశీ… ఎన్నో రికార్డులను కొల్లగొట్టారు. దీంతో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ను అందరూ మెచ్చుకుంటూ రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీలు మాత్రం భిన్నంగా స్పందిస్తూ.. వైభవ్ ను కించపరుస్తున్నారు.
వైభవ్ సూర్యవంశీ వయస్సు 15 కాదని… 25 ఏళ్ల యువకుడు అంటూ కొందరు అంటుంటే.. మరి కొంతమంది అతని బ్యాట్ లో ఏఐ చిప్స్ ఉన్నాయని ఆరోపిస్తున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ స్పోర్ట్స్ జర్నలిస్టు షాహిద్ హష్మీ మరో బాంబు పేల్చాడు. యూఏఈ జట్టు చాలా బలహీనమైనదని.. అలాంటి బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ చేయడం పెద్ద విషయమేమీ కాదని పరువు తీశాడు. యూఏఈపై 500 కొట్టనా పట్టించుకోరని.. అనవసరంగా వైభవ్ సూర్యవంశీని హీరోను చేస్తున్నారని హేళన చేశారు. దమ్ముంటే పాకిస్తాన్ పైన డబుల్ సెంచరీ కాదు అర్థ సెంచరీ చేసినా, తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరాడు. దీంతో పాకిస్తాన్ స్పోర్ట్స్ జర్నలిస్టు షాహిద్ హష్మీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
యూఏఈ జట్టుపై డబుల్ సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ.. తమ పాకిస్తాన్ జట్టుపై ఇంత అద్భుతంగా ఆడగలుగుతాడా ? అంత దమ్ము అతనిలో ఉందా? అంటూ పాకిస్తాన్ స్పోర్ట్స్ జర్నలిస్టు షాహిద్ హష్మీ కౌంటర్ ఇచ్చాడు. అసలైన బౌలర్లను వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు ఎదుర్కోలేదని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ లో చాలా మ్యాచులు ఆడిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పటి వరకు పెద్ద ఇన్నింగ్స్ ఎక్కడ ఆడలేదని హేళన చేశాడు.
మొన్న గ్రూప్ స్టేజిలో పాకిస్తాన్ తో తలపడినప్పుడు 11 పరుగులకే అవుటేయాడని సెటైర్లు పేల్చాడు. అంతకు ముందు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ల్లోనూ తేలిపోయాడన్నాడు. రేపు ఫైనల్స్ లో కూడా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంటుందని.. అక్కడ కూడా వైభవను త్వరగా ఔట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. పసికూనలపై విజృంభించడం కాదని.. మగాడైతే పాకిస్తాన్ పైన ఆడి చూపించాలని సవాల్ చేశాడు. అప్పుడే వైభవ్ సూర్యవంశీ పై ప్రశంసలు మరింత పెరుగుతాయని వెల్లడించాడు.