E-Paper

Sam Curran: స్కూల్ కు వెళ్లే బుడ్డోడిని తీసుకొచ్చి, బిల్డ‌ప్ ఇస్తున్నారు

Sam Curran: స్కూల్ కు వెళ్లే బుడ్డోడిని తీసుకొచ్చి, బిల్డ‌ప్ ఇస్తున్నారు
Advertisement

Sam Curran:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో (Indian Premier League 2026 tournament) అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ (VAIBHAV SURYAVANSHI), అతి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. ఐర్లాండ్ సిరీస్ లో మిస్ అయినప్పటికీ.. ఇంగ్లాండ్ తో ఖచ్చితంగా ఆడతాడు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే, వైభవ్ పై అంచనాలు పెరిగిన నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ (Sam Curran) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్య వంశీ గురించి బాగా బిల్డప్ ఇస్తున్నారని చురకలు అంటించారు. స్కూల్ కు వెళ్లే బుడ్డోడిని తీసుకువచ్చి.. తమతో ఆడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సెటైర్లు పేల్చారు. ఐపీఎల్ లో తప్ప అంతర్జాతీయ క్రికెట్ లో వైభవ్ ఆడడం అసాధ్యమని పరువు తీశారు. ఒకవేళ తమతో ఆడించినప్పటికీ… వైభవ్ ను త్వరగా అవుట్ చేసేలా తమ వద్ద ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కచ్చితంగా వైభవ్ ను డక్ అవుట్ చేయడం గ్యారెంటీ అంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో వైభవ్ సూర్య వంశీ పై సామ్ కర్రన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

స్కూల్ కు వెళ్లే బుడ్డోడిని తీసుకొచ్చి, బిల్డ‌ప్ ఇస్తున్నారు

Advertisement

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేయబోతున్న నేపథ్యంలో డేంజర్ బెల్స్ పంపించాడు ఇంగ్లాండు ఆల్రౌండర్ సామ్ కర్రన్. వైభవ్ సూర్య వంశీ పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు… వాటన్నిటిని మేము పోగొడతామంటూ హెచ్చరించారు. వైభవ్ సూర్య వంశీ అరంగేట్రం తమపై చేస్తే.. అతడిని త్వరగా ఔట్ చేసే వ్యూహాలు తమ వద్ద ఉన్నయంటూ వార్నింగ్ ఇచ్చారు. 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అసాధ్యమన్నారు.

కానీ ఐపీఎల్ లో మాత్రం అద్భుతంగా రాణించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ క్రికెటర్లో వైభవ్ రాణిస్తే సక్సెస్ అవుతాడని ప్రశంసించారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఫ్లాట్ మైదానాలు ఉంటాయని.. ఇంగ్లాండులో పిచ్ లు చాలా భిన్నంగా ఉంటాయని గుర్తు చేశారు. దానివల్ల వైభవ్ సక్సెస్ కాలేడని స్పష్టం చేశారు. ఒకవేళ తమపై వైభవ్ అరంగేట్రం చేస్తే.. తొలి మ్యాచ్ లో ఎలా ఆడతాడో అంచనా వేయలేమని వ్యాఖ్యానించారు. కానీ ప్రతి క్రికెటర్ కు ఉన్నట్లుగానే వైభవ్ కు ఎత్తు పల్లాలు ఉంటాయని స్పష్టం చేశారు సామ్ కర్రన్. దీంతో సామ్ క‌ర్ర‌న్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. అయితే, అత‌నికి వైభ‌వ్ ఆన్స‌ర్ క‌చ్చితంగా ఇస్తాడ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

Also Read: Tanveer Ahmed Reacts On Team India vs England T20 Series: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

Related News

ఐపీఎల్ హీరో వైభ‌వ్ కు ఘోర అవ‌మానం…చీప్ గా రూ.15 వేల‌ క‌ల‌ర్ టీవీ గిఫ్ట్

బీసీసీఐని దెబ్బ‌కొట్టేందుకు పాక్ కుట్ర‌లు…సౌదీ అరేబియాతో క‌లిసి స్కెచ్‌

Tanveer Ahmed: మా వెధ‌వ‌ల‌ను ఇంగ్లీష్ కాస్లులతో పాటు మెంటల్ ఆస్ప‌త్రిలోనూ వేయండి

Michael Vaughan: టికెట్లు కొని సిద్ధంగా ఉన్నాం..ఇంకెన్ని రోజులు వైభవ్ ను దాస్తారు

వివాదంలో అభిషేక్ శ‌ర్మ‌..వైభ‌వ్ తో వెట్టిచాకిరీ, బ్యాట్లు మోయిస్తూ మ‌రీ !

వైభ‌వ్ 2-3 ఓవ‌ర్లు ఆడితే చాలు, ఇంగ్లండ్ అడ్ర‌స్ గ‌ల్లంతు ఖాయం..మాజీ క్రికెట‌ర్ వార్నింగ్

Furqan: పాకిస్తాన్ కంటే ఐర్లాండ్ బెట‌ర్‌..టీమిండియాను నేల నాకించేసింది

Big Stories

×