Vaibhav Suryavanshi: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో కేవలం 14 ఏళ్ల వయసుగల యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ లో భాగంగా నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రోజున యూఏఈ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 42 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశి ఏకంగా 144 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తన ఇన్నింగ్స్ లో బౌండరీల కంటే సిక్స్ లే ఎక్కువగా కొట్టడం విశేషం.
Also Read: Ind Vs Sa: చేత్తులెత్తేసిన బ్యాటర్లు.. తొలి టెస్టులో టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం
తన 144 పరుగుల్లో 15 సిక్సులు, 11 ఫోర్లు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఇంతకుముందు ఐపిఎల్ లో విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఇతర టోర్నీలలోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. 342.85 స్ట్రైక్ రేటుతో యూఏఈ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
144 పరుగుల భారీ రన్స్ చేసిన అనంతరం తాజాగా బీసీసీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశి మాట్లాడుతూ.. ” నేను ఎంత బాగా ఆడినప్పటికీ, డబుల్ సెంచరీ చేసినప్పటికీ మా నాన్న మాత్రం సంతృప్తి చెందరు. నేను 200 పరుగులు చేసినా.. మా నాన్న తృప్తిగా ఉండరు. ఇంకో పది పరుగులు చేయాల్సింది అంటారు. కానీ మా అమ్మ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. నేను సెంచరీ చేసినా, డకౌట్ అయినా.. ఆమె ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. బాగా ఆడమని మాత్రమే చెబుతుంది. మైదానంలో నేను అసాధారణ షాట్లు ప్రయత్నించను. చిన్నప్పటినుండి ప్రాక్టీస్ చేసిన వాటికే కట్టుబడి ఉంటాను. నా ఆటలో భాగం కానిది కొత్తగా ప్రయత్నిస్తే.. అది జట్టుకు, వ్యక్తిగతంగా నాకు మేలు చేయదు” అని చెప్పుకొచ్చాడు.
వైభవ్ 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్లతో ఏకంగా 144 పరుగులు నమోదు చేశాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి.. ఆ తర్వాత పది బంతుల్లోనే మరో 40 పరుగులు రాబట్టి రికార్డు సృష్టించాడు. పురుషుల టి-20 లో అత్యధిక స్ట్రైక్ రేట్ తో సెంచరీ చేసిన ఆటగాళ్లలో నాలుగవ స్థానంలో నిలిచాడు. ఈ రికార్డులో మాత్రం టి-20 నెంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ పంజాబ్ తరఫున ఆడుతున్న సమయంలో 365.51 స్ట్రైక్ రేట్ తో 29 బంతుల్లోనే 106 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.
Also Read: Ipl 2026: ఐపీఎల్ 2026లో వేలంలోకి రాబోతున్న డేంజర్ ప్లేయర్.. లిస్ట్ లో రసెల్, పతిరణ
ఇక దేశం తరపున ఆడుతూ సీనియర్ లెవెల్ లో సెంచరీ సాధించిన యువ ప్లేయర్ గా నిలిచాడు. 2005లో బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ 16 సంవత్సరాల 171 రోజుల వయస్సులో జింబాబ్వే ఏ తో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అత్యంత తక్కువ వయసులో 111 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించగా.. ఆ రికార్డుని 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ బ్రేక్ చేశాడు.