BigTV English

Rcb fan : RCB కప్ గెలిచిందని పిచ్చోడిలా.. రక్తం పారిస్తారా..!

Rcb fan :  RCB కప్ గెలిచిందని పిచ్చోడిలా.. రక్తం పారిస్తారా..!

Rcb fan : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు జూన్ 03న పంజాబ్ కింగ్స్ పై ఐపీఎల్ సీజన్ 2025 ఫైనల్ లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇది 18వ సీజన్ కావడం.. అలాగే ఆర్సీబీ కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ జెర్సీ నెం.18 కూడా కావడం విశేషం. 19 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ జట్టు 6 బంతుల్లో 29 పరుగులు సాధించాల్సి ఉంది. దీంతో విజయం ఖాయమని బెంగళూరు జట్టు అప్పుడే భావించింది. రెండు బంతులు అయ్యాక విరాట్ కోహ్లీ కంట తడి పెట్టాడు. మ్యాచ్ ముగిసే సమయానికి విరాట్ కింద పడి మరీ ఏడ్చడంతో అతడిని అభిమానించే ప్రతీ ఒక్కరూ టీవీల్లో చూస్తూ.. కంట తడి పెట్టడం విశేషం. విరాట్ కోహ్లీ అభిమానులు కానీ వారు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read : Vaibhava Suryavanshi : ఆంటీ వయసు హీరోయిన్ తో 14 ఏళ్ల కుర్రాడు ఎంజాయ్!

ఆర్సీబీ కప్ గెలిచిందన్న ఆనందంలో ఓ అభిమాని పిచ్చోడిలా మారిన వీడియో వైరల్ అవుతోంది. చేతిని కట్ చేసుకొని రక్తంతో కోహ్లీకి వీరతిలకం దిద్దాడు. అంతటితో ఆగకుండా టీ షర్ట్ విప్పేసి గట్టిగా అరుస్తూ రచ్చ చేసాడు. తానే ఈ ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అవుతూ భావోద్వేగానికి గురయ్యాడు. మన దేశంలో ఇలాంటి పిచ్చివాళ్లకు కొదవ లేదని.. వ్యక్తి పూజ మానుకోవాలని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడంతో బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 04న సంబురాలు నిర్వహించిన విషయం విధితమే. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు.  తొక్కిసలాటలో మృతి చెందిన 11 మంది కుటుంబాలకు ఆర్సీబీ ఒక్కొక్కరికీ రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో గాయపడిన వారి కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. 


మరోవైపు బెంగళూరు తొక్కిసలాట ఘటన పై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న 21 గేట్లు తెరిచారా..? అని ప్రశ్నించింది హైకోర్టు. స్టేటస్ రిపోర్ట్ ని మంగళవారం పరిశీలిస్తామని న్యాయస్థానం పేర్కొంది. భారీ స్థాయిగా సంబరాలు జరుగుతుంటే.. ముందస్తు భద్రత చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది హైకోర్టు. నిజానికి అసలు ఆర్సీబీ విజయోత్సవాలు జరుపుకోవద్దని ముందే పోలీసులు సూచించారట. కానీ ఆర్సీబీ మాత్రం అవేమి పట్టించుకోలేదు. విజయోత్సవ వేడుకలు బుధవారానికి బదులు ఆదివారం నిర్వహించుకోవాలని సూచిస్తే.. అప్పుడు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని.. వేడిమీద వేడుకలు నిర్వహించకపోతే తమకు డ్యామేజ్ అవుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్సీబీ యాజమాన్యం వాదనతోనే ముందుకెళ్లింది. ఆర్సీబీ టైటిల్ గెలిచిన మరుక్షణం నుంచే బెంగళూరు వీధుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నట్టు సమాచారం. అలా దేశ వ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు గల్లీ నుంచి రాష్ట్ర రాజధానుల వరకు సంబురాలు జరుపుకోవడం విశేషం.

https://twitter.com/NakaliDuniya/status/1930663653403168974

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×