Deepika Padukone : దీపికా పదుకొనే టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలో ఆమె కెరీర్ లో ఉన్నాయి. ఇకపోతే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కల్కి సినిమాలో ఆమెను తీసుకుంటున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు చాలామంది సర్ప్రైజింగ్ ఫీల్ అయ్యారు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా ఒక సంచలనం అని చెప్పాలి. ఆ సినిమా విడుదలైన తర్వాత మహాభారతం గురించి చర్చలు పెట్టడం మొదలుపెట్టారు కొంతమంది. అది నాగ అశ్విన్ యూత్ లో తీసుకొచ్చిన మార్పు. ఒక సినిమాకి ఎంత శక్తి ఉంటుందో అని మరోసారి రుజువు చేసిన సినిమా అది.
స్పిరిట్ నుంచి తప్పించేశారు
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న చిత్రం స్పిరిట్. ఈ సినిమా నుండి దీపికను తొలగించినట్లు అధికారికంగానే ప్రకటించారు. ఎందుకంటే 8 గంటల పని షిఫ్ట్‌లు, భారీ రెమ్యునరేషన్ మరియు సినిమా లాభంలో వాటా కోరిన తర్వాత. ఆమెను తొలగించి హీరోయిన్ గా త్రిప్తి దిమ్రీని ప్రకటించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. దీనిపై చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అయ్యారు. కాగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమాలో త్రిప్తి దిమ్రీని చూసి చాలా మంది ఫిదా అయిపోయారు. అయితే సందీప్ తీసుకున్న ఈ డెసిషన్ బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ థింగ్ అని రాంగోపాల్ వర్మ లాంటి దర్శకులు కూడా ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం దీపికా ప్రభాస్ మరో సినిమా నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కల్కి సినిమా నుంచి తప్పుకుంటుందా.?
‘కల్కి 2898 AD’ పార్ట్ 2 నుండి కూడా తప్పుకున్నట్లు సమాచారం. 8 గంటల పని షిఫ్ట్ ఉండాలనే డిమాండ్ కారణంగా ఆమె సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. దీపిక కల్కి 2898 AD నిర్మాతలను తక్కువ పని గంటలు కావాలని అడిగారు, ఎందుకంటే ఆమె ఇప్పుడు పాప దువాకు తల్లి, ఆమెకు సెప్టెంబర్ 2024లో పాప పుట్టిన విషయం తెలిసిందే . అయితే, ఈ సినిమా భారీ స్థాయిలో ఉండటం వల్ల, ఆమె డిమాండ్ కు ఒప్పుకోవడం మేకర్స్ కష్టంగా భావిస్తున్నారని, అందువల్ల, వారు ఇప్పుడు ఆమె పాత్రను తొలగించాలని లేదా తగ్గించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సిఉంది. ఒకవేళ దీపిక నిజంగా తప్పుకున్నట్లయితే తన మీద నెగెటివిటీ ఇంకా పెరిగిపోతుంది.
Also Read : Srinu Vaitla: భలే మోసం చేశావు మావా, వెంకీ సినిమా పేరు అది కాదా.?