BigTV English

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Vinesh Phogat Bajrang Punia| రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బిజేపీ సీనియర్ నాయకుడు బ్రిజ్ భూషణ్ సారణ్ సింగ్ .. ఒలింపిక్స్ మహిళా రెజర్ల్ వినేళ్ ఫోగట్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లేందుకు వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసిందని.. అందుకే ఆమె విజయం సాధించకుండా దేవుడే శిక్షించాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


మహిళా రెజ్లర్ ను లైంగిక వేధిస్తున్నాడుంటూ 2023లో ప్రముఖ రెజ్లర్లంతా బ్రిజ్ భూషణ్ సారణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పలుమార్లు నిరసన చేశారు. నెలల తరబడి నిరసనలు చేసిన తరువాత కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం బ్రిజ్ భూషణ్ సారణ్ సింగ్ పై చర్యలు తీసుకుంది. ఆయనను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా పారిస్ ఒలింపిక్స్ కుస్తీ పోటీల ఫైనల్ నుంచి వివాదాస్పదంగా వైదొలిగిన వినేశ్ ఫోగట్ పై బిజేపీ నాయకుడు బ్రిజ్ భూషణ్ సారణ్ సింగ్ ఆరోపణలు చేశారు. ”నేను వినేశ్ ఫోగట్ కు ఒక్కటే అడగదలుచుకున్నాను. ఒక రెజ్లర్ రెండు వెయిట్ (బరువు) కేటగిరీల్లో ఒకే రోజు ట్రయల్స్ చేయగలడా?.. వెయిట్ చూసే ట్రయల్స్ 5 గంటలపాటు ఆమె కోసం ఆపేయడం నిజం కాదా?.. వినేశ్ ఫోగట్ ఒలింపిక్స్ లో విజయం సాధించలేకోపోయింది. ఆమె చీటింగ్ చేసి అక్కడికి వెళ్లింది. ఆ దేవుడు అందుకే ఆమెను శిక్షించాడు.” అని బ్రిజ్ భూషణ్ సారణ్ సింగ్ ఆవేశంగా మాట్లాడారు.


వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా రెజ్లర్లు శుక్రవారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలు చేరారు. వారిద్దరూ బ్రిజ్ భూషణ్ సారణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసనలు చేసిన వారే. అయితే వారు కాంగ్రెస్ లో చేరిన మరుసటి రోజే బ్రిజ్ భూషణ్ సారణ్ సింగ్ ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. హర్యాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వినేశ్ ఫోగట్ జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మరోవైపు బజరంగ్ పూనియా ఆల్ ఇండియ్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ గా నియమించబడ్డారు.

Also Read: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

బిజేపీ సీనియర్ నాయకుడు బ్రిజ్ భూషణ్ సారణ్ సింగ్.. వినేశ్ ఫోగట్ తో పాటు బజరంగ్ పూనియా, కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు చేశారు. బజరంగ్ పూనియా ట్రయల్స్ చేయకుండానే ఏషియన్ గేమ్స్ పోటీలకు వెళ్లారని బ్రిజ్ భూషణ్ సారణ్ సింగ్ చెప్పారు.

మహిళా రెజ్లర్లను తాను లైంగికంగా వేధించానంటూ ఆరోపణలు చేసి నిరసనలు చేసిందంతా డ్రామా అని ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేయించిందని బిజేపీ నాయకుడు బ్రిజ్ భూషణ్ సారణ్ సింగ్ చెప్పారు. ఈ డ్రామా అంతా కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ హూడా నాయకత్వంలో నడిచిందని అన్నారు.

బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ వల్ల హర్యాణా క్రీడాకారులకు తీవ్ర నష్టం కలిగిందని ఘూటు వ్యాఖ్యాలు చేశారు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×