BigTV English

Vinesh Phogat: వినేశ్ ఫోగట్.. హార్ట్ బ్రేకింగ్ పోస్ట్

Vinesh Phogat: వినేశ్ ఫోగట్.. హార్ట్ బ్రేకింగ్ పోస్ట్

Vinesh Phogat Heart Breaking Post: ఇన్నాళ్లూ ఎదురుచూసిన తీర్పు రానే వచ్చింది. ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న ఆశ ఒక్కసారిగా ఆరిపోయింది. తీర్పు మాట విన్నాక వినేశ్ ఫోగట్ గుండె పగిలింది. ఆ తీర్పు కోసం పారిస్ లోనే ఆగిపోయిన వినేశ్.. ఒంటరిగా హోటల్ గదిలోనే మిగిలిపోయింది. ఓదార్చడానికి సహచరులు కూడా లేకపోవడంతో తన పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.


ఒలింపిక్ మెడల్ అనేది ప్రతి క్రీడాకారుని జీవిత కల. అది నెరవేరే సమయంలో ఇలా జరగడం అత్యంత బాధాకరమనే చెప్పాలి. 117 మంది క్రీడాకారులు ఇండియా నుంచి వెళ్లారు. కానీ ఆరుగురికి మాత్రమే పతకాలు వచ్చాయి. మిగిలిన వాళ్లందరూ రిక్త హస్తాలతోనే తిరిగి స్వదేశానికి వచ్చారు. కానీ వినేశ్ ఫోగట్ విషయంలో అలా జరగలేదు. చేతికొచ్చిన పతకం చేజారిపోయింది. న్యాయస్థానానికి వెళ్లినా న్యాయం జరగలేదు.

దీంతో వినేశ్ ఫోగట్ నెట్టింట హార్ట్ బ్రేకింగ్ పోస్టు పెట్టింది. కాస్ తీర్పు ఎంతో వేదనకు గురిచేసిందనే అర్థం వచ్చేలా పారిస్ ఒలింపిక్స్ లో మ్యాట్ పై కిందపడి కన్నీళ్లు తుడుచుకుంటున్న ఫొటోను పెట్టింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. అంతేకాదు భారతీయులందరూ వినేశ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. నువ్వు నిజమైన ఛాంపియన్ అంటూ కీర్తిస్తున్నారు. నువ్వే భారతదేశానికి గోల్డ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పతకం పోయినందుకు బాధపడకు.. నువ్వే మా అసలైన ఛాంపియన్ అంటూ పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.


Also Read: నెదర్లాండ్స్‌ పరుగులకు బ్రేకులు వేస్తున్న యూఎస్ఏ బౌలర్లు.. 200 మార్క్ దాటుతారా?

అయితే 100 గ్రాముల బరువు వినేశ్ చూసుకోలేదా? కోచ్ చూసుకోలేదా? సహాయక సిబ్బంది చూసుకోలేదా? ఒలింపిక్ నిర్వాహక కమిటీ చూసుకోలేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లేదంటే బౌట్ మధ్యలో మంచినీళ్లు ఎక్కువ తాగిందా? లేక ఫ్లూయిడ్స్ ద్వారా వెళ్లిన కంటెంట్ కారణంగా బరువు పెరిగిందా? అనే అంశంపై క్లారిటీ లేదు. ఒకవేళ ముందే చూసుకుని ఉంటే కనీసం జుత్తు అయినా కత్తిరించుకునేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. నిజంగా ఇది దురద్రష్టకరమే అంటున్నారు.

ఇప్పటికే భారత రెజ్లింగ్ సమాఖ్యతో గొడవలు పడి, వీధెక్కిన 29 ఏళ్ల వినేశ్ ఫోగట్ ఇంక ఆడలేనని చేతులెత్తేసింది. రిటైర్మెంట్ ప్రకటించింది. మరి మన పెద్దలు ఏమైనా కల్పించుని స్పందిస్తే.. మనసు మార్చుకుంటుందేమో చూడాలి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×