BigTV English

Football Match In Turkey: ఓడిపోయిన ఆటగాళ్లపై.. అభిమానుల దాడి టర్కీలో ఫుట్ బాల్ మ్యాచ్ లో గొడవ

Football Match In Turkey: ఓడిపోయిన ఆటగాళ్లపై.. అభిమానుల దాడి టర్కీలో ఫుట్ బాల్ మ్యాచ్ లో గొడవ

Violence Breaks Out Between Fans and Players


Violence Breaks Out Between Fans and Players(Sports news headlines): టర్కీ లో రెండు దేశీయ పుట్ బాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రసాభాసగా మారింది.  ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ట్రాబ్జోన్స్‌పోర్ క్లబ్‌పై 3-2 తేడాతో ఫెనర్ బాస్ టీమ్ గెలిచింది. ఈ విజయం తర్వాత, ఫెనర్‌బాస్ ఆటగాళ్ళు మైదానంలో విజయాన్ని సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. అయితే ఓడిన జట్టు అభిమానులకు వళ్లు మండిపోయింది.

పెద్ద సంఖ్యలో మైదానంలోకి ప్రవేశించి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో గొడవకు దిగారు. అంతేకాదు తమ జట్టు ఓడిపోవడంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఓడిపోయిన తమ ఆటగాళ్లపై దాడిచేశారు. కసితీరా వారిని చితక బాదారు.


ఈ గొడవలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు మాత్రం తమ ప్రాణాలను కాపాడుకుని, ఎలాగోలా మైదానం నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో కొందరు అభిమానులపై ఆటగాళ్లు పంచ్ లు విసిరారు. వారు కూడా ఊరుకోలేదు. అంతకు మించి ఆటగాళ్లను ఎగిరి తన్నారు. ఒంగోబెట్టి పిడిగుద్దులు గుద్దారు. భద్రతా సిబ్బంది వచ్చి ఆటగాళ్లను సురక్షితంగా డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకువెళ్లి, వారి ప్రాణాలను కాపాడారు.

Also Read: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ విజేతలు వీరే..

ఈ ఘటనపై అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య ఫిఫా ఆగ్రహం వ్యక్తంచేసింది. స్టేడియం నిర్వాహకులను వివరణ కోరింది. మరోసారి ఇలాంటివి జరగకుండా చూడాలని ఆదేశించింది.

అభిమానులకు, ఆటగాళ్లకు మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టర్కీలో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా హింసాత్మక వార్త వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి హింసాత్మక ఘటనలు ఇక్కడ సహజమేనని అంటున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×