BigTV English

Chinnaswamy Stadium : అంత భారీ వర్షం పడ్డా.. మ్యాచ్ నిర్వహించారు… చిన్నస్వామి స్టేడియంలో కొత్త డ్రైనేజీ వ్యవస్థ?

Chinnaswamy Stadium : అంత భారీ వర్షం పడ్డా.. మ్యాచ్ నిర్వహించారు… చిన్నస్వామి స్టేడియంలో కొత్త డ్రైనేజీ వ్యవస్థ?

Chinnaswamy Stadium :  సాధారణంగా భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ మైదానాల్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఒకటి.  భారతదేశంలో ఉన్నటువంటి ఏ మైదానంలోనైనా చిన్నపాటి వర్షం పడ్డా ఆ మైదానం అంతా తడిసి పోతుంటుంది. ఇక జరగాల్సిన ఆటను నిలిపివేసి వాయిదా వేస్తుంటారు. కానీ బెంగళూరు చిన్న స్వామి స్టేడియానికి ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా మూడు ట్యాంకర్ల నీరు ఒకే చోట మైదానంలో పోసినా ఇట్టే మాయమైపోతుంది. ప్రపంచంలో ఏ మైదానానికి లేని ప్రత్యేకత ఈ చిన్నస్వామి స్టేడియానికి ఉన్నది. ప్రపంచంలోనే ఎక్కడ లేని సబ్ ఎయిర్ డ్రైనేజీ, ఎయిరేషన్ సిస్టమ్ ని కలిగి ఉంది.


Also Read :  Craze for IPL: PSL ఇజ్జత్ తీస్తున్న పాక్ ఫ్యాన్స్..గ్రౌండ్ లోనే IPL చూస్తున్నారు !

సబ్ ఎయిర్ డ్రైనేజీకి రూ.4.25 కోట్లు 


బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో 2017లో కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సబ్ ఎయిర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీంతో ఎంత భారీ వర్షం కురిసినా 15 నుంచి 20 నిమిషాలలోనే మైదానాన్ని మ్యాచ్ కి సిద్దంగా అనుమతిస్తుంది. అయితే సబ్ ఎయిర్ డ్రైనేజీ సిస్టానికి దాదాపు రూ.4.25 కోట్లు ఖర్చు అయినట్టు సమాచారం. వర్షం ప్రారంభమైన నిమిషానికి 10వేల లీటర్ల కంటే ఎక్కువ వేగంతో సూపర్-శోషణ పైపుల ద్వారా నీటిని తీయడం ద్వారా సబ్ ఎయిర్ వ్యవస్థ పని చేస్తుంది.

పరిక్షీంచిన అధికారులే పరిషాన్.. 

ఇటీవలే ఈ స్టేడియాన్ని పరీక్షీంచిన అధికారులు పరిషాన్ అయ్యారు. ప్రధానంగా స్టేడియంలోకి మూడు పైపుల ద్వారా నీరు వదిలారు. అందరూ చూస్తుండగానే కొద్ది సేపటికే నీరు మొత్తం భూమిలోకి ఇంకిపోయింది. ఆ తరువాత అధికారులు మైదానం లోపలికి వెళ్లి చూడగా.. కొంచెం కూడా తడి లేదని చూసి ఆశ్చర్యపోవడం విశేషం. ముఖ్యంగా మైదానంలో ఏర్పాటు చేసిన రిమోట్ సెన్సార్లు, టెక్నాలజీ అద్భుతమనే చెప్పాలి. రూట్ జోన్ కి అనువైన పెరుగుదల వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీంతో పాటు టర్ఫ్ వ్యాధులు, ఆల్గే, అధిక గడ్డి  నల్ల పొరలను కూడా తగ్గిస్తుంది. ఇది ఉపరితల ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మైదానంలో ఆటగాళ్లకు కూడా మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.

నిన్న రాత్రి చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఆ స్టేడియంలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యం గా ప్రారంభం అయింది.  చీకటి ఎక్కువగా ఉండటం.. సమయం తక్కువగా ఉండటం వల్ల ఈ మ్యాచ్ ని కేవలం 14 ఓవర్లకు మాత్రమే కుదించారు.  ఈ మ్యాచ్ కి ముందు భారీ వర్షం కురిసినప్పటికీ తొందరగా వర్షపు నీటిని బయటికీ పంపించేందుకు ఈ డ్రైనేజీ వ్యవస్థను ఉపయోగించారు. ఈ స్టేడియంలో 2017 నుంచి సబ్ ఎయిర్ డ్రైనేజీ వ్యవస్థను వాడుతున్నారు. ఈ డ్రైనేజీ సిస్టమ్ ద్వారా వర్షం పడినా కానీ మ్యాచ్ రద్దు కాకుండా మ్యాచ్ జరుగుతోంది.  ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఓడిపోవడం విశేషం. పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.

Related News

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

Big Stories

×