BigTV English

Virat Kohli Fan Base: ఇదేం క్రేజ్ రా… కోహ్లీ కోసం పాకిస్థాన్ ప్రాణాలు ఇచ్చేలా ఉందిగా !

Virat Kohli Fan Base: ఇదేం క్రేజ్ రా… కోహ్లీ కోసం పాకిస్థాన్ ప్రాణాలు ఇచ్చేలా ఉందిగా !

Virat Kohli Fan Base: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మనదేశంలోనే కాకుండా పొరుగు దేశం పాకిస్తాన్ లోను పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పాకిస్తాన్ యువతలో కోహ్లీకి ఎంత ఫాలోయింగ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది.


Also Read: Ex Pak women’s team captain: పాకిస్థాన్ కెప్టెన్ గా ధోని ఉన్నా.. మావోళ్లు ఏం పీకలేరు !

తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. దాయాధుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీని చూసిన పాకిస్తాన్ అభిమానులు హర్షద్వానాలు వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ కి ఉన్న అపారమైన ప్రజాదారణ సరిహద్దులు దాటింది. ఈ టోర్నీలో వారి జట్టు ఓటమిపాలైనప్పటికీ.. కోహ్లీ సెంచరీ చేయడంతో ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ అభిమానులు చప్పట్లు కొడుతూ ఆనందించారు.


విరాట్ కోహ్లీ తన 51 వన్డే సెంచరీతో పాకిస్తాన్ క్రీడాభిమానుల మనసు కూడా దోచుకున్నాడు. తన సెంచరీతో పాకిస్తాన్ పై ఆరు వికెట్ల తేడాతో భారత్ కి విజయాన్ని అందించాడు. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ లో జరుగుతున్న మ్యాచ్లలో కానీ, ఇటు దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లలో కానీ.. ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ జెర్సీ లతోనే క్రీడాభిమానులు దర్శనమిస్తున్నారు. వీరిలో భారత క్రీడాభిమానుల కంటే పాకిస్థాన్ క్రీడాభిమానిలే ఎక్కువగా విరాట్ కోహ్లీ జెర్సీతో దర్శనమిస్తున్నారు.

తాజాగా ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ కి చెందిన ఓ మహిళ.. కింగ్ కోహ్లీ పేరున్న జెర్సీతో దర్శనం ఇచ్చింది. ఇక పాకిస్తాన్ జెర్సీపై విరాట్ 18 అనే నెంబర్ గల జెర్సీలు దర్శనమిస్తున్నాయి. ఇలా విరాట్ కోహ్లీ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారు పాకిస్తాన్ క్రీడాభిమానులు. ఇలా వైరల్ గా మారిన వీడియోలు, ఫోటోలను చూసిన భారత క్రీడాభిమానులు.. “ఇదేం క్రేజ్ రా బాబు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: Terror Threat: ఉగ్రవాదుల కుట్రలు..పాకిస్థాన్‌ నుంచి పారిపోతున్న విదేశీ జట్లు ?

ఇక విరాట్ కోహ్లీ ఆటకు పాకిస్తాన్ మొత్తం ఫిదా అవుతుందని లో ఎటువంటి సందేహం లేదు. ఆదివారం రోజు జరిగిన మ్యాచ్ తర్వాత.. సోమవారం పాకిస్తాన్ మీడియా మొత్తం విరాట్ కోహ్లీకి కేజిఎఫ్ లెవెల్ లో ఎలివేషన్స్ ఇచ్చాయి. పాకిస్తాన్ ని మరోసారి విరాట్ కోహ్లీ ఓడించాడని, కింగ్ కోహ్లీ, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అంటూ.. భారత మీడియాను మించి పాకిస్తాన్ మీడియా విరాట్ కోహ్లీని పొగిడింది. ఇక “డాన్” అనే పాకిస్తాన్ ఇంగ్లీష్ పేపర్ ఏకంగా విరాట్ కోహ్లీని “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” గా అభివర్ణిస్తూ పత్రికను ప్రచురించింది.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×