BigTV English

Madraskaaran Movie Review : మెగా డాటర్ బోల్డ్‌ గా కనిపించిన ‘మద్రాస్ కారన్’ మూవీ రివ్యూ

Madraskaaran Movie Review : మెగా డాటర్ బోల్డ్‌ గా కనిపించిన ‘మద్రాస్ కారన్’ మూవీ రివ్యూ

దర్శకుడు : వాలి మోహన్ దాస్
నటీనటులు : షేన్ నిగమ్, కలైయరసన్, నిహారిక కొణిదెల, ఐశ్వర్య దత్తా, కరుణాస్
ఓటీటీ ప్లాట్ ఫామ్ : ఆహా
సంగీతం : సామ్ సీఎస్


ప్రముఖ మలయాళ నటుడు షేన్ నిగమ్ ‘మద్రాస్ కారన్’ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కలైయరసన్, నిహారిక కొణిదెల, ఐశ్వర్య దత్తా యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. ఈ తమిళ యాక్షన్ మూవీ 2025 జనవరి 10న రిలీజై మిక్స్డ టాక్ తెచ్చుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ఇప్పటికే తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పుడు తెలుగులోనూ ఈ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజే ఓటీటీలోకి వచ్చిన ‘మద్రాస్ కారన్’ మూవీ తెలుగు ఓటీటీ లవర్స్ ను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ
ఇంజనీర్ అయిన సత్య చెన్నైలో ఉంటాడు. తన ప్రియురాలు మీరాను ఘనంగా వివాహం చేసుకోవడానికి తన స్వస్థలమైన పుదుకోట్టైకి తిరిగి వస్తాడు. అయితే గతంలో కొన్ని గొడవల కారణంగా సత్య ఫ్యామిలీ ఊరు విడిచి వెళ్ళిపోతుంది. చాలా కాలం తరువాత గ్రామస్తులు తన రిచ్ లైఫ్ ను చూడాలనే కోరికతోనే అతను స్వంత ఊర్లోనే పెళ్లికి ఏర్పాట్లు చేసుకుటనడు. కానీ పెళ్లి రోజున జరిగే ఒక సంఘటన సత్యమూర్తి విధిని మారుస్తుంది. ఇది స్థానిక రౌడీ సింగం ఆగ్రహానికి దారితీస్తుంది. సింగం, సత్య మధ్య గొడవకు కారణం ఏంటి ? ఊరంతా ఏకమై ఎందుకు పెళ్లి కొడుకును చంపాలి అనుకుంటారు ? చివరకు ఏం జరిగింది? అన్నది కథ.


విశ్లేషణ
‘మద్రాస్ కారన్’ మనుషుల అహంకారం, గొడవలు, కుటుంబ రాజకీయాలు, కులం, దురాశ వంటి అంశాల ఆధారంగా తెరకెక్కింది. సినిమా అంతా స్నేక్ అండ్ ల్యాడర్ లా ఉంటుంది. అయితే స్క్రీన్ ప్లేను ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ తడబడ్డాడు. సత్య, మీరా మధ్య లవ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఏమాత్రం పండలేదు. ‘సఖి’ సినిమాలోని ‘నగిన నగిన’ అనే రొమాంటి సాంగ్ ని ఇందులో రీమిక్స్ చేసారు. ఈ పాట షాన్ నిగమ్, నిహారిక మధ్య తెరకెక్కింది. ఇందులో నిహారిక, షాన్ నిగమ్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, బోల్డ్ డ్యాన్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయి. హీరో డబ్బింగ్ విషయం కూడా మైనస్సే. మిగతా నటీనటులు పర్వాలేదు అన్పించారు.

మొదటి 30 నిమిషాల తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ తరువాత ఎమోషనల్ ఇంటర్వెల్ తో బ్రేక్ పడుతుంది. సెకండాఫ్ మాత్రం మొత్తం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ కన్విన్సింగ్ గా ఉండదు. ఈ సినిమాలో విజువల్స్ బాగున్నాయి. దినేష్ సుబ్బరాయన్ చేసిన స్టంట్స్ ఆకట్టుకుంటాయి. కానీ పాటలు, బీజీఎం మాత్రం మైనస్ అని చెప్పవచ్చు. సినిమాకు తగ్గ విధంగా సామ్ సీఎస్ నుంచి ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసిన మ్యూజిక్ ను ఆయన ఇవ్వలేకపోయాడు. సినిమాలో ప్లస్ కంటే మైనస్ లే ఎక్కువగా ఉన్నాయి.

మొత్తానికి…
రెండు గంటల రోత అని కొంత మంది ప్రేక్షకులు ఫీల్ అవ్వడం ఖాయం. అయితే ఎలాంటి అంచనాలు లేని ఆడియన్స్, అలాగే నీహారిక బోల్డ్ నెస్ కోసం ఓసారి మూవీని చూడవచ్చు.

రేటింగ్ : 2.5/5

Related News

Beauty Movie Review : ‘బ్యూటీ’ మూవీ రివ్యూ… బ్యూటీ కాదు స్కూటీ

Bhadrakaali Movie Review : భద్రకాళి రివ్యూ… అంతా ఒకే.. కానీ పేరే బాలేదు

KishkindhaPuri Movie Review: ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ : భయపెట్టింది.. అయినా ఫోన్ చూడాల్సి వచ్చింది

Mirai Movie Review : మిరాయ్ రివ్యూ – సూపర్ హీరో సూపర్ ఉందా ?

Mirai Twitter Review: ‘మిరాయ్’ ట్విట్టర్ రివ్యూ.. తేజా అకౌంట్ లో మరో బ్లాక్ బాస్టర్..?

Baaghi 4 Review : ‘బాఘీ 4’ మూవీ రివ్యూ… దుమ్మురేపే యాక్షన్, కానీ అసలు కథ మిస్

The Conjuring: Last Rites Review : ‘ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్’ రివ్యూ… లొరైన్ దంపతులకు పర్ఫెక్ట్ సెండాఫ్

Madharaasi Movie Review : ‘మదరాసి’ మూవీ రివ్యూ: ‘తుపాకీ’ స్టైల్లో ఉన్న డమ్మీ గన్

Big Stories

×