Terror Threat: చాలా సంవత్సరాల తర్వాత దాయాది పాకిస్తాన్ ఓ ఐసీసీ ఈవెంట్ కి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పలు దేశాల ఆటగాళ్లు పాకిస్తాన్ లో పర్యటిస్తున్నారు. విదేశీ ఆటగాళ్లు మాత్రమే కాకుండా ఈ మ్యాచ్ లు వీక్షించేందుకు ఆయా దేశాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ కి చేరుకున్నారు. ఈ టోర్నీలో జరుగుతున్న మ్యాచ్ లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ లో క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లకు, ఆ మ్యాచ్ లు చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు ఓ షాక్ తగిలింది.
Also Read: AFG vs ENG: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ డూర్ ఆర్ డై.. గెలిస్తేనే సెమీస్ !
పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీ 2025 పై ఉగ్రవాదులు కుట్ర {Terror Threat} పన్నుతున్నట్లు సమాచారం. ఈ టోర్నీలోని మ్యాచ్ లు చూసేందుకు హాజరవుతున్న విదేశీయులను కిడ్నాప్ చేయడానికి కుట్ర జరుగుతుందని పాకిస్తాన్ ఇంటలిజెంట్ హెచ్చరించినట్లు వార్తలు వెలువడ్డాయి. తహ్రీక్ – ఈ తాలిబాన్ పాకిస్తాన్ {టిటిపి}, ఐఎస్ఐఎస్ బలుచిస్తాన్ కి చెందిన ఇతర ఉగ్రవాద సంస్థలు ఈ కుట్రకు పాల్పడినట్లు పాకిస్తాన్ ఇంటలిజెన్స్ తెలిపిందని వార్తలు వెలువడ్డాయి.
విదేశీ అతిధులను లక్ష్యంగా చేసుకొని పలు ఉగ్రవాద గ్రూపులు {Terror Threat} కుట్ర చేస్తున్నట్టు పాకిస్తాన్ ఇంటలిజెన్స్ అనుమానిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పాకిస్తాన్ ఇంటలిజెన్స్ బ్యూరో సోమవారం రోజు భద్రత దళాలకు సందేశం పంపింది. యాక్టివ్ కోవర్ట్ గ్రూప్ లు ఈ కుట్రకు తెర తీశాయని.. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం. అయితే భద్రతా కారణాల దృశ్యా పాకిస్తాన్ కి వెళ్లేందుకు భారత్ నిరాకరించిన విషయం తెలిసిందే.
దీంతో భారత్ కి సంబంధించిన మ్యాచ్ లు పూర్తిగా దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. కానీ ఇతర దేశాలకు సంబంధించిన మ్యాచులు పాకిస్తాన్ లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఉగ్రవాద గ్రూపులు ఛాంపియన్ ట్రోఫీ పై కుట్ర చేస్తున్నాయన్న నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లకు, అతిథులకు భారీ రక్షణ కల్పించేందుకు స్థానిక పోలీసులు, ఆర్మీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కన్ను పడడంతో పాకిస్థాన్ సర్కార్ కూడా హై అలర్ట్ ప్రకటించింది. అయినప్పటికీ ఉగ్రవాదుల నుండి ఇలాంటి సమాచారం బయటకి రావడంతో విదేశీయులు గజగజ వణికి పోతున్నారు.
Also Read: Yograj Singh: పాకిస్తాన్ కొత్త కోచ్‌గా యువరాజ్ తండ్రి.. ?
వీటన్నింటినీ {Terror Threat} గమనించిన విదేశీ అభిమానులు వెంటనే పాకిస్తాన్ ని ఖాళీ చేసి వారి దేశాలకు వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది దుబాయికి చేరుకుంటున్నారు. అయితే ఉగ్రవాదుల టెన్షన్ ఉన్న తరుణంలో పాకిస్తాన్ కాకుండా మిగిలిన జట్లు కూడా భయపడుతున్నాయట. ఈ తరుణంలో ఈ టోర్నీ లోని మిగిలిన మ్యాచ్ లని పాకిస్తాన్ లో కాకుండా.. ఇండియాకు నిర్వహించినట్లు దుబాయిలో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయని సమాచారం. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పై నీలి నీడలు కమ్ముకున్నాయి.