BigTV English

Virat Kohli: కొహ్లీ…ఇన్సిపిరేషన్ డైలాగ్

Virat Kohli: కొహ్లీ…ఇన్సిపిరేషన్ డైలాగ్

Virat Kohli: రన్ మిషన్ లా వరల్డ్ కప్ లో కొహ్లీ పరుగెడుతున్నాడు. 34 ఏళ్ల వయసులో ఇప్పటికి కుర్రాళ్లకన్నా చురుగ్గా గ్రౌండ్ లో కదులుతాడు. అనుక్షణం యాక్టివ్ గా ఉంటాడు. చుట్టూ ఉన్న అందరిలో చైతన్యం నింపుతాడు. ఒక కసి, ఆవేశం, పట్టుదల, దేశం కోసం ఆడాలన్న తపన ఇలా ఎన్నింటినో కలగొలిపి కొత్తగా వచ్చేవాళ్లకి ఒక కిక్ ఇస్తూ ఉంటాడు. ఇప్పటికే 5 మ్యాచుల్లో 118 సగటుతో 354 పరుగులు చేశాడు. వరుసగా 85, 55, 16, 103, 95 చేశాడు.  


నిజమే కొహ్లీ గ్రౌండ్ లో ఉంటే అందరికీ స్ఫూర్తి, ఒక ధైర్యం ఉంటుంది. బ్యాటింగ్ చేసేవాళ్లకి వెనక కొహ్లీ ఉన్నాడనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కొహ్లీ క్రీజులో ఉంటే ప్రత్యర్థి దేశాల్లోని క్రికెట్ అభిమానులకు వణుకు పుడుతుంది. 140 కోట్లమంది భారతీయులకు గుండె నిబ్బరంగా ఉంటుంది. అలాంటి కొహ్లీ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ యువతకు స్ఫూర్తినిచ్చే ఒక మాటన్నాడు. అదిప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

“ప్రతిక్షణం నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాను. అందుకోసం నిరంతరం శ్రమిస్తాను. ఏ రోజూ బద్దకించను. తెల్లవారు జామున 4 గంటలకి లేవాలంటే లేస్తాను. అది శరీరం గడ్డకట్టించే చలి అయినా, కుండపోతలా కురిసే వర్షమైనా లెక్క చేయను. ఫిజికల్ గా ఫిట్ గా ఉండటానికి ట్రై చేస్తాను. రాత్రిళ్లు టైమ్ కి నిద్రపోతాను. 10 గంటలకి అంటే పక్కా అంతే.. అందులో తిరుగులేదు” అని అన్నాడు.


“ప్రతీది ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటాను. ప్రతి ఏడాది, ప్రతి సీజన్, ప్రతి మ్యాచ్, ప్రతి ప్రాక్టీస్ సెషన్ ఇలా ప్రతీసారి నన్ను నేను కొత్తగా ఉండటానికి, ఇంకా మెరుగ్గా ఆడటానికేం చేయాలో ప్రతిక్షణం నేర్చుకుంటూనే ఉంటాను. తెలుసుకుంటూనే ఉంటాను. వీడెవడు నాకు చెప్పడానికి అనుకోను. కొత్తగా ఎవరు షాట్స్ కొట్టినా ఎలా కొట్టారని చూస్తుంటాను.
నేను ఏ బాల్స్ కి ఎక్కువ అవుట్ అవుతానో, ఆ బలహీనతల నుంచి బయటపడటానికి నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తాను.
అలా ప్రతిక్షణం నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను కాబట్టే 15 ఏళ్లయినా ఇప్పటికి అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతున్నాను” అని తెలిపాడు.

ఈ నిలకడ లేకపోతే, ఇటువంటి మనస్తత్వం లేకపోతే రాణించడం అసాధ్యమని అన్నాడు. “ఒక లక్ష్యంతో గిరిగీసుకుంటే అక్కడికి చేరుకున్నాక ఆగిపోతాం. ఒక సంతృప్తితో ఇక ఆడింది చాల్లే అనుకుంటాం. అందుకే ఆటపై ఇంట్రస్ట్ ఒక్కటే ఉంటే సరిపోదు. అంకిత భావం కూడా కావాలి. అది ఉంటే సుదీర్ఘకాలం ఏ రంగంలోనైనా రాణించవచ్చు. అందుకు నిరంతర  కృషి చేయాలి. ఆటలో అదృష్టం అన్నివేళలా రాదు. పైన చెప్పినవన్నీ చేస్తే…అప్పుడు
అదృష్టంతో సంబంధం ఉండదు.” అని తేల్చి చెప్పాడు.

చూశారు కదండీ.. కొహ్లీ మాటలు. ఇది నేటితరానికెంతో స్ఫూర్తిమంతంగా ఉన్నాయి కదా. మరి అందరూ ఆ విధంగా చేస్తారు కదూ.

Related News

Muralitharan vs Gambhir: గంభీర్ ఇజ్జత్ తీసిన మురళీధరన్.. అతనికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు

Pak Player Run out: పాకిస్థాన్ ప్లేయర్ల బద్ధకం చూడండి…రనౌట్ అయి..తోటి ప్లేయర్ దాడి ?

S J Suryah: టీమిండియా బౌలర్ ను అవమానించిన టాలీవుడ్ విలన్

Dhoni Fan Died: ఐపీఎల్ 2026 కంటే ముందే CSK జట్టులో పెను విషాదం!

Tim David – Brevis: ఇద్దరు విషయంలో అంబానీ తప్పుడు నిర్ణయం.. అతలాకుతలంలో ముంబై ఇండియన్స్

Ramiz Raja: బాల్ లో చిప్ పెట్టారు.. వెస్టిండీస్ పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు.. అంతా తొండాట అంటూ !

Big Stories

×