E-Paper
Advertisement

Virender Sehwag: రాజ‌స్థాన్ ఓపెన‌ర్లుగా వైభ‌వ్, ఆశీర్వాద్ ల‌కు ఛాన్స్ ఇవ్వండి

Virender Sehwag: రాజ‌స్థాన్ ఓపెన‌ర్లుగా వైభ‌వ్, ఆశీర్వాద్ ల‌కు ఛాన్స్ ఇవ్వండి
Advertisement

Virender Sehwag:  15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని తట్టుకోవడమే కష్టం అని భావిస్తున్న బౌలర్లు.. ఇప్పుడు మరో సవాల్ ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సిందే. తాజాగా వైభవ్ సూర్య వంశీ సోదరుడు ఆశీర్వాద్ సూర్యవంశీ తన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. వైభవ్ (Vaibhav Sooryavanshi) 15 ఏళ్లు అయితే.. ఈ బుడ్డోడు పదేళ్లు మాత్రమే. కానీ చిచ్చర పిడుగులా బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 87 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు ఆశీర్వాద్ సూర్యవంశీ. ఈ క్రమంలో ఇప్పుడు ఈ పదేళ్ల బుడ్డోడి పేరు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అన్ని అనుకుంటే ఇప్పుడు తమ్ముడు ఆశీర్వాద్ ( Ashirvad Sooryavanshi ) బౌలర్లకు నరకం చూపిస్తున్నాడని సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ పోస్టులు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే వైభవ్ సోదరుడు ఆశీర్వాద్ ( Ashirvad Sooryavanshi century) బ్యాటింగ్ అదరగొట్టిన నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. వెంటనే వైభవ్ అలాగే ఆశీర్వాద్ ఇద్దరినీ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లుగా బరిలోకి దింపాలని కామెంట్ చేశారు. ఈ ఇద్దరు బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలే అంటూ వ్యాఖ్యానించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

రాజ‌స్థాన్ ఓపెన‌ర్లుగా వైభ‌వ్, ఆశీర్వాద్ ల‌కు ఛాన్స్ ఇవ్వండి

Advertisement

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సోదరుడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. వైభవ్ సూర్య వంశీ సిక్సర్లు అలాగే బౌండరీలతో రెచ్చిపోతుంటే.. అతడి సోదరుడు ఆశీర్వాద్ మాత్రం కాస్త రిలాక్స్ గా 100 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సమస్తి పూర్ లో జరిగిన లోకల్ మ్యాచ్ సందర్భంగా 15 ఏళ్ల బుడ్డోడు ఆశీర్వాద్ సూపర్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్య వంశీ ఫ్యామిలీలో అందరూ చిరుత పులిలా దూసుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇలాంటి కుర్రాళ్ళు ఉండడం ఆ కుటుంబం చేసుకున్న అదృష్టం అంటూ వ్యాఖ్యానించారు. వీళ్లను పెంచిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యారు వీరేంద్ర సెహ్వాగ్. అయితే ఈ ఇద్దరి కుర్రాళ్లను రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లుగా బరిలోకి దించాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు బరిలోకి దిగితే రాజస్థాన్ సులభంగా 300 పరుగులు సాధించడం గ్యారంటీ అని వెల్లడించారు. రాజస్థాన్ రాయల్స్ కు వరుసగా టైటిల్స్ కూడా తీసుకువచ్చే బాధ్యత వీళ్ళకి అప్పగించాలని కామెంట్ చేశారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

Related News

టీమిండియాతో మ్యాచ్‌..భ‌య‌ప‌డి పారిపోయిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్

ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని

అజింక్య రహానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

Big Stories

Advertisement
×