E-Paper
Advertisement

ఆ పాకిస్తాన్ అంపైర్ కు లంచం ఇచ్చా..వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌నం !

ఆ పాకిస్తాన్ అంపైర్ కు లంచం ఇచ్చా..వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌నం !
Advertisement

Virender Sehwag: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs. Pakistan) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. పహాల్గమ్ సంఘటన (Pahalgam incident) తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరిగితే షేక్ హ్యాండ్ లు కూడా ఇచ్చుకోవడం లేదు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ దివంగత అంపైర్ అసద్ రఫ్ పై ( Pakistani umpire Asad Rauf) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag ). ఆ పాకిస్తానీ అంపైర్ అసద్ రౌఫ్ కు తాను చాలా సార్లు లంచం ఇచ్చానని… దాంతో తాను ఔట్ అయినా కూడా, నాటౌట్ గా ప్రకటించాడని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. యువరాజ్ సింగ్ మొదటగా లంచం ( a bribe ) ఇవ్వడం అలవాటు చేయగా.. ఆ తర్వాత తాను కూడా అదే దారిని ఎంచుకున్నానని బాంబు పేల్చారు. దీంతో అసద్ రఫ్ పై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

ఆ పాకిస్తాన్ అంపైర్ కు లంచం ఇచ్చా..వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌నం !

Advertisement

లంచం ఇస్తే పాకిస్తాన్ దివంగత అంపైర్ అసద్ రౌఫ్ టీమిండియాకు అనుకూలంగా చాలా సార్లు నిర్ణయాలు ప్రకటించాడని వీరేంద్ర సెహ్వాగ్ సంచలన కామెంట్స్ చేశారు. కాన్పూర్ మ్యాచ్ సందర్భంగా యువరాజ్ సింగ్ ఎల్బీడబ్ల్యూ అయినప్పటికీ… అసద్ రౌఫ్‌ నాటౌట్ ఇచ్చాడని గుర్తు చేశారు. అయితే దీనిపై మ్యాచ్ తర్వాత అ తానే నిలదీశానని వెల్లడించారు వీరేంద్ర సెహ్వాగ్. అది ఔట్ కదా..? ఎందుకు నాటౌట్ ఇచ్చావు ? అని ప్రశ్నించినట్లు గుర్తు చేశారు. ఆ సమయంలో ఇవి తనకు యూవీ గిఫ్ట్ ఇచ్చాడని… అందుకే అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అసద్ రౌఫ్‌ చెప్పాడని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. అయితే అప్పటి నుంచి తాను కూడా అసద్ రౌఫ్ కు గిఫ్టులు, లంచాలు ఇవ్వడం మొదలుపెట్టానని బాంబు పేల్చారు వీరేంద్ర సెహ్వాగ్.

మొహాలీ టెస్ట్ వివాదంపై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

మొహాలీ టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా అలాగే టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. అయితే అందులో 93 పరుగుల వద్ద ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ కు మిచెల్ జాన్సన్ అదిరిపోయే బంతి వేశాడు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్ కు బంతి తగిలిందని… ఈ క్రమంలో వికెట్ కీపర్ క్యాచ్ అందుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ ఔట్ అని డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న రాహుల్ ద్రావిడ్ కూడా… బ్యాటింగ్ చేసేందుకు మైదానం దాకా వచ్చేసాడు. కానీ ఆ సమయంలో అంపైర్ గా ఉన్న అసద్ రౌఫ్‌ మాత్రం దాన్ని నాటౌట్ గా ప్రకటించేశారు. ఆ సమయంలో DRS సిస్టం లేదు కాబట్టి వీరేంద్ర సెహ్వాగ్ బతికిపోయాడు. అంపైర్ అసద్ రౌఫ్‌ నిర్ణయమే ఫైనల్ అయింది. అయితే దీనిపై అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఘటనను తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేస్తూ… తాను లంచం ఇచ్చాను కాబట్టే అంపైర్ అసద్ రౌఫ్‌ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని వెల్లడించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Advertisement

 

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×