Adult Comedy Movie: ఒకే ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్లు ఉంటే రచ్చ ఎలా ఉంటుంది ? అస్తమానూ అయినదానికీ కానిదానికీ కొట్టుకు చస్తూ, పేరెంట్స్ ప్రాణాలు తోడేస్తారు. కానీ అన్నదమ్ముల అనుబంధాన్ని అడల్ట్ బ్లాక్ కామెడీతో ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. పైగా ఈ సినిమాను చూశాక…. మీ అన్నయ్యను ఎలా ఏడిపించాలి అనే టాపిక్ పై ఇంకా బాగా ట్రైన్ అవుతారు. ఆ సినిమా పేరే ‘లిటిల్ బ్రదర్’ (Little Brother). మరి ఫ్యామిలీతో కాకుండా సింగిల్ గా చూడాల్సిన ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడొచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
రుడ్ (జాన్ సెనా) సక్సెస్ ఫుల్, పాపులర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. అతని జీవితం చాలా క్రమశిక్షణతో, పర్‌ఫెక్ట్‌గా సాగిపోతుంటుంది. తన భార్య డీర్డ్రే (మిచెల్ మోనాఘన్), పిల్లలతో కలిసి ఒక అందమైన ఇల్లు, లగ్జరీ లైఫ్‌తో అతను ఎంతో హ్యాపీగా ఉంటాడు. రోజువారీ రొటీన్, ప్లాన్ చేసిన షెడ్యూల్, క్లీన్ ఇల్లు…. ఇలా అతని జీవితంలో అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి. అయితే రుడ్ జీవితం ఇలా సాఫీగా సాగుతున్న సమయంలో, చిన్ననాటి లవబ్లీ చాటిక్ అంటే అల్లరి, వింత మనస్తత్వం ఉన్న తమ్ముడు మార్కస్ (ఎరిక్ ఆండ్రే) ఊహించని విధంగా అతని ఇంట్లోకి ఊడిపడతాడు.
మార్కస్ ఎక్కడ ఉంటే అక్కడ ఏదో ఒక గందరగోళం, నాశనం జరుగుతూనే ఉంటుంది. మొదట్లో ఒకటి రెండు రోజులు ఉంటాడని రుడ్ భార్య మార్కస్ ను ఇంట్లోకి రానిస్తుంది. కానీ మార్కస్ తన వింత ప్రవర్తనతో రుడ్ పర్‌ఫెక్ట్ లైఫ్ ను పూర్తిగా మార్చేస్తాడు. రుడ్ కారు తలుపులు ఊడిపోవడం, ఇల్లు తగలబడే పరిస్థితి రావడం వంటి క్రేజీ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. రుడ్ భార్య డీర్డ్రే కూడా మార్కస్ అల్లరి చూసి విసిగిపోతుంది. పైకి ఇదంతా కామెడీగా సాగినప్పటికీ, మార్కస్ మనసులో తన అన్నయ్య రుడ్ నీడలోనే పెరిగాననే ఒక చిన్న బాధ, అభద్రతాభావం ఉంటాయి.
మరోవైపు, రుడ్ కూడా తన తమ్ముడి ఫ్రీడం, లైఫ్ ను చూసి లోపల అసూయ పడుతుంటాడు. ఈ భావోద్వేగాలు కలిసి కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. చివరికి ఈ ఇద్దరి భిన్నమైన మనస్తత్వాల వల్ల తెరపై ఎలాంటి నవ్వులు పూశాయి ? ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు ? ఇద్దరి మధ్య ఉన్న పాత గొడవలను మరిచిపోయి ఎలా ఒకటయ్యారు ? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను వీక్షించాల్సిందే.
‘లిటిల్ బ్రదర్’ 2026 జూన్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా ఓటీటీలోనే విడుదలైన మూవీ. ప్రపంచవ్యాప్తంగా నవ్వుల పంట పండించిన ఆ అమెరికన్ కామెడీ చిత్రంలో హాలీవుడ్ స్టార్ జాన్ సెనా, ప్రముఖ కమెడియన్ ఎరిక్ ఆండ్రే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ క్రేజీ బడ్డీ-కామెడీ చిత్రం Netflixలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.
Read Also: హెడ్ మాస్టర్ కూతురితో ప్రేమాయణం… మళ్లీ మళ్ళీ చూడాలన్పించే తెలుగు సిరీస్