E-Paper
Advertisement

నరకంలో ఉన్న పేరెంట్స్ కోసం దేవుడితో ఒప్పందం… మెంటలెక్కించే సూపర్ నేచురల్ థ్రిల్లర్

నరకంలో ఉన్న పేరెంట్స్ కోసం దేవుడితో ఒప్పందం… మెంటలెక్కించే సూపర్ నేచురల్ థ్రిల్లర్
Advertisement

Taiwanese fantasy web series: స్వర్గం – నరకం అనేవి ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఇలాంటి వాటిని నమ్మేవాళ్ళు అందరూ చచ్చాక స్వర్గానికి వెళ్ళాలి అని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. తప్పులు చేసిన వాళ్ళే నరకానికి వెళ్తారని అనుకుంటారు. ఒకవేళ అలా నరకంలోకి వెళ్తే తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుందా ? అలా రావడానికి దేవుడితో డీల్ చేసుకోవచ్చా ? దేవుడి ఏజెంట్ గా మారి దెయ్యాలపై యుద్ధం చేయొచ్చా ? అంటే ఈ సినిమా డైరెక్టర్ అవుననే అంటున్నారు. అదే ఆలోచనతో తైవానీస్ వెబ్ సిరీస్ ‘ఏజెంట్ ఫ్రమ్ అబవ్’ (Agent from Above)ను తెరకెక్కించారు. మరి ఈ విజువల్ వండర్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? దాని కథ ఏంటి ? అన్న విషయంలోకి వెళ్తే…

కథలోకి వెళ్తే….

చైనీస్/తావోయిస్ట్ పురాణాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ యాక్షన్-ఫాంటసీ సిరీస్ దేవుళ్లు, రాక్షసులు, మానవుల మధ్య జరిగే భయంకరమైన పోరాటాన్ని చూపిస్తుంది. దేవుళ్లు, రాక్షసులు మానవ ప్రపంచంలో నేరుగా తిరగడానికి అనుమతి లేదు. అందువల్ల వారు భూమిపై తమ పనులను పూర్తి చేయడానికి ఒక సాధారణ మనిషిని ఏజెంట్‌ గా సెలెక్ట్ చేసుకుంటారు.

Advertisement

హాన్ చియాంగ్ (కై కో) చిన్నతనంలో చేసిన ఒక పెద్ద పాపం వల్ల అతని తల్లిదండ్రులు నరకానికి వెళ్తారు. తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, తన తల్లిదండ్రులను రక్షించుకోవడానికి అతను ఒక దైవిక శక్తితో ఒప్పందం కుదుర్చుకుంటాడు. థర్డ్ క్రౌన్ ప్రిన్స్ ఏజెంట్గా మారతాడు. చైనీస్ పురాణాల ప్రకారం శక్తివంతమైన దేవుడైన ‘థర్డ్ క్రౌన్ ప్రిన్స్’ (వాంగ్ పో-చీహ్) కు హాన్ చియాంగ్ భూమిపై ఒక మీడియం లేదా ఏజెంట్‌గా మారతాడు.

మానవ ప్రపంచంలో దెయ్యాలు, ఆత్మలు, రాక్షసుల వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించడమే అతని బాధ్యత. ఇందుకోసం అతనికి కొన్ని సూపర్ పవర్స్ ఇస్తాడు దేవుడు. ఈ ప్రయాణంలో అతనికి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ, తన ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని నమ్మే ‘యే జు’ అనే కాలేజీ అమ్మాయి, అలాగే ఆత్మలను చూడగల శక్తి ఉన్న పోలీస్ డిటెక్టివ్ ‘చాంగ్ మిన్’ పరిచయమవుతారు. వీరంతా ఒక టీమ్‌గా ఏర్పడతారు.అప్పుడే పెద్ద ముప్పు ఎదురవుతుంది:

Advertisement

మరోవైపు మానవ – రాక్షస లోకాల మధ్య ఉన్న ప్రశాంతతను దెబ్బతీసి, భూమిని నాశనం చేయాలని చూస్తాడు విలన్ ‘చెన్ చి-షా’. శక్తివంతమైన డెమన్ కింగ్ తో కలిసి ఈ ప్లాన్ చేస్తారు. ఈ ప్రమాదకరమైన రాక్షస శక్తుల నుండి హాన్ చియాంగ్ మానవ ప్రపంచాన్ని ఎలా రక్షించాడు ? తన దైవిక శక్తులతో రాక్షస రాజును ఎలా ఓడించాడు ? చివరికి తన తల్లిదండ్రులను నరకం నుండి విడిపించగలిగాడా లేదా ? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిన మిగిలిన కథ.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

‘ఏజెంట్ ఫ్రమ్ అబవ్’ (Agent from Above) అద్భుతమైన ఫాంటసీ సిరీస్. ప్రస్తుతం Netflixలో తెలుగు ఆడియోతో అందుబాటులో లేదు. కానీ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 2026 ఏప్రిల్ 2 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ తీన్సీ రాసిన ‘ది ఒరాకిల్ కమ్స్’ అనే ప్రసిద్ధ ఫాంటసీ నవల ఆధారంగా రూపుదిద్దుకుంది. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడేవారు అస్సలు మిస్ అవ్వొద్దు.

Read Also: మార్నింగ్ బాయ్ ఫ్రెండ్, నైట్ గర్ల్ ఫ్రెండ్ తో… నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవడిదిరా బాధ్యత

Tags

Related News

కోట్ల ఆస్తి, విలాసవంతమైన కుటుంబం… కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్… మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

ది బీటిల్స్ నుంచి హాలీవుడ్ పాప్ స్టార్ల వరకు… ప్రపంచ దిగ్గజాల వెనుక ఉన్న మ్యూజిక్ మొఘల్ కథ

కట్స్ లేకుండా ఒకే ఒక్క షాట్‌లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్… నిజంగానే ఆ భయంకరమైన ఇంట్లో ఉన్న థ్రిల్లిచ్చే థ్రిల్లర్

ఆ వర్షపు రాత్రి చేసిన ఒక్క తప్పు… చిన్న పొరపాటుకు జీవితాంతం శిక్ష… హార్ట్ టచింగ్ స్టోరీ

హీరో కావాలంటే ఇన్ని అవమానాలా? ఒక్క అవకాశం కోసం జీవితాన్నే పణంగా పెట్టిన యువకుడి కథ

ఒకే ఇంట్లో ఉన్నా ఒకరికొకరు దూరం… లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మినీ సిరీస్

30 పెళ్లి సంబంధాలు ఫెయిల్.. 31వ పెళ్లి కూడా పెటాకులు… ఈ అమ్మాయి చేసిన పనికి హ్యాట్సాఫ్

తండ్రిని కాదని ప్రేమికురాలి కోసం వెళ్తే… దెబ్బకు గుర్తొచ్చే గత జన్మ…

Big Stories

Advertisement
×