Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఆ జట్టుకు కెప్టెన్ గా పనిచేసే దమ్ము ధైర్యం ఎవడి దగ్గర లేదని తెలుస్తోంది. అందుకే తాజాగా పాత కెప్టెన్ బాబర్ ఆజం కు (Babar Azam) మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board). మొన్నటి వరకు టెస్ట్ కెప్టెన్ గా పనిచేసిన షాన్ మసూద్ పై వేటు వేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. బాబర్ ఆజంకు బాధ్యతలు అప్పగించింది. ఇలాంటి నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబర్ ఆజం, రెచ్చిపోయి మాట్లాడారు. తాను ఎప్పుడు పర్సనల్ రికార్డుల కోసం క్రికెట్ ఆడలేదని.. విరాట్ కోహ్లీ లాగా సెల్షీష్ గా బిహేవ్ చేయలేదంటూ బాంబు పేల్చారు. అనవసరంగా తనకు, విరాట్ కోహ్లీకి మధ్య కంపారిజన్ చేస్తూ ఉంటారని ఫైర్ అయ్యారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి పోలిక లేదని.. కావాలనే కొంతమంది తమ ఇద్దరి మధ్య పోలికలను చూస్తూ రకరకాల విషయాలను వైరల్ చేస్తూ ఉంటారని ఆగ్రహించారు. దీంతో బాబర్ ఆజం చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ గా అవకాశం వచ్చిన నేపథ్యంలో బాబర్ ఆజం కళ్ళు నెత్తికెక్కినట్లు తెలుస్తోంది. ఏకంగా విరాట్ కోహ్లీ పైనే సెటైర్లు వేస్తూ రచ్చ చేశాడు. విరాట్ కోహ్లీ పర్సనల్ రికార్డుల కోసం మాత్రమే ఆడతాడని బాంబు పేల్చాడు. తాను మాత్రం ఏ రోజు కూడా వ్యక్తిగత రికార్డుల కోసం మ్యాచ్ లు ఆడలేదన్నారు. ఆ కష్టాన్ని చూసే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, తనకు కెప్టెన్సీ బాధ్యతలను ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రాణం పోయేవరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం ఆడతానని వ్యాఖ్యానించారు. క్రికెట్ అంటే తనకు ప్రాణం అన్నారు. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యే దిశగా అడుగులు వేస్తానని స్పష్టం చేశారు బాబర్ ఆజం. అనవసరంగా విరాట్ కోహ్లీ తో తనను పోల్చకండి అంటూ హితువు పలికారు. దీంతో విరాట్ కోహ్లీపై బాబర్ ఆజం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
వెస్టిండీస్, ఇంగ్లాండ్ తో త్వరలోనే రెండు టెస్ట్ సిరీస్ లు ఆడనుంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఈ క్రమంలో షాన్ మసూద్ పైన వేటువేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… బాబర్ ఆజం కు సారాధ్య బాధ్యతలు అప్పగించింది. మసూద్ కెప్టెన్సీలో పాకిస్తాన్ మొత్తం 16 మ్యాచులు ఆడింది. ఇందులో 12 ఇంటిలో పాకిస్తాన్ ఓడిపోవడం గమనార్హం. బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ కూడా అయింది. అందుకే బాబర్ కు అవకాశం ఇచ్చారు.