BigTV English

Ashutosh Sharma: పేదింటి నుంచి.. క్రికెటర్‌గా ఎదిగిన అశుతోష్ ప్రస్థానం ఇదే..!

Ashutosh Sharma: పేదింటి నుంచి.. క్రికెటర్‌గా ఎదిగిన అశుతోష్ ప్రస్థానం ఇదే..!

Who Is Ashutosh Sharma: క్రికెట్ పై తనకి ఎంత ప్రేమంటే, దానికోసం, జీవితాన్ని, భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి ఆడాడు. ఇరుకిరుకు గదుల్లో ఉండి, పూట తిండి కోసం పాట్లు పడ్డాడు. తను అనుకున్నది సాధించడానికి ఎంత ప్రయాస పడ్డాడో తెలుసుకుంటే, అందరికీ కళ్ల వెంట నీళ్లు వస్తాయి. జీవిత లక్ష్యం సాధించాలంటే ఇంత స్ట్రగుల్ కావాలా? అని పిస్తుంది. ఇంతకీ ఆ క్రికెటర్ మరెవరో కాదు.. యువ కెరటం, .పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ అశుతోష్ శర్మ స్ఫూర్తిదాయక కథ ఇది.


నేటి యువత అందరూ తనని ఆదర్శంగా తీసుకోవాలి. అంటే క్రికెట్ లోనే కాదు, చదువులో, ఇంటి బాధ్యతల్లో, ఉద్యోగాల్లో ప్రతిచోటా ఆ అంకిత భావం ఉంటే, ఏనాటికైనా మనకంటూ ఒకరోజు వస్తుందనేది అశుతోష్ ని చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది.

నిజమే, మధ్యప్రదేశ్ లోని అత్యంత పేద కుటుంబంలో అశుతోష్ జన్మించాడు. ఇండోర్ కి దగ్గరలోని రాత్లామ్ గ్రామంలో ఉండేవాడు. ఎనిమిదేళ్ల వయసులో ఇండోర్ లో క్రికెట్ ఆటలో శిక్షణకు వచ్చాడు. మధ్య ప్రదేశ్ తరఫున లిస్ట్ ఏ మ్యాచ్ ల్లో రాణించి, అందరి ద్రష్టిలో పడ్డాడు. 2019లో సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ తుదిపోరులో 84 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. భారత మాజీ క్రికెటర్ అమి కురేసియా
కంట్లో పడ్డాడు. తను అశుతోష్ లోని ప్రతిభను గుర్తించాడు. అతని ఆటలోని లోపాలను సరిచేశాడు. అంతర్జాతీయ క్రికెటర్ గా తీర్చిదిద్దాడు.


అయితే కరోనా దెబ్బకి అతని కెరీర్ గాడి తప్పింది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. చాలా ఇరుకు గదుల్లో ఉండేవాడు. రోజూ భోజనానికి చాలా ఇబ్బందులు పడేవాడు. రకరకాల పనులు చేసేవాడు. కోవిడ్ తర్వాత జట్టులోకి ఎవరెవరో రికమండేషన్లతో వచ్చేవారు. తను రిజర్వ్ బెంచ్ పై ఉండేవాడు. ఇల్లు గడవడం కష్టమైంది. దీంతో డబ్బులు వస్తాయని అంపైరింగ్ కూడా చేశాడు.

కానీ ప్రతీ వాడికి ఒక రోజు వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అది భగవంతుడు ఇస్తాడు. దాన్ని నిలబెట్టుకున్నోడు గొప్పోడవుతాడు. అలాంటివాడిలో ఒకడు అశుతోష్. 2023 ముస్తాక్ ఆలీ టోర్నీలో అవకాశం రావడంతో తనింక వదిలిపెట్టలేదు. వదిలితే మళ్ల రిజర్వ్ బెంచ్ అనుకున్నాడు. ఏదొక రికార్డ్ కొట్టాలని అనుకున్నాడు.

టీ 20ల్లో యువరాజ్ సాధించిన ఆఫ్ సెంచరీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. 11 బంతుల్లోనే 50 పరుగులు చేసి శభాష్ అనిపించాడు. అంతే ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పంజాబ్ కింగ్స్ 2024 వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు ఈ ఆల్ రౌండర్ ను సొంతం చేసుకుంది.

Also Read: మాజీ క్రికెటర్ రామన్ ఇక లేరు, సొంతూరు ఏపీలోని..

పంజాబ్ కింగ్స్ లో ఇప్పుడు తనెంత విలువైన ఆటగాడో నిరూపించాడు. బుమ్రా సంధించిన యార్కర్ ని కూడా సిక్సర్ గా కొట్టి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేశాడు. ఒకవైపు నుంచి పంజాబ్ రేసులో వెనుకపడి పోతోంది. మరి అశుతోష్ ఎలా ముందడుగు వేస్తాడో చూడాల్సిందే.

Tags

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×