Big Stories

UPSC Aspirant : పరీక్షలో ఫేలయ్యి.. ఫుల్లు ఫేమసయ్యాడు

UPSC Aspirant R. Virulkar: ఏ ప్రయత్నంలోనైనా పోరాటం చాలా ముఖ్యం. ఆ పోరాట ఫలితంగానే విజయాలు సాధిస్తారు. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా విజయాలు దరిచేరవు. అయినా కూడా ఆ సమయంలో ప్రతిదీ ఒక అనుభవంగా మిగిలిపోతుంది. అంతేకాదు.. వారు భవిష్యత్తులో ఇంకా ఎటువైపు ప్రయత్నం చేసినా విజయాన్ని ఈజీగా సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

- Advertisement -

అయితే, ఇప్పుడు ఈ విషయాన్ని మీకెందుకు గుర్తు చేస్తున్నాను అంటే.. యూపీఎస్సీ పరీక్ష అంటే ఎంత కఠినంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే, ఈ పరీక్ష కోసం పలుసార్లు ప్రయత్నం చేసి విజయం సాధించినవారు చాలామంది ఉంటారు. ఇంకొందరేమో ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అవుతుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం పట్టువిడవని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు.. కానీ, విజయం సాధించలేకపోయాడు. అయినా అతడిని, అతడి పట్టుదలను, నిరాశ చెందకుండా ప్రయత్నించిన తీరును నెటిజన్లు మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో ఇప్పుడతను సోషల్ మీడియాలో చాలా ఫేమసయ్యాడు.

- Advertisement -

అయితే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ క్రమంలో ఆర్. విర్కులర్ అనే యూపీఎస్సీ ఆస్పిరెంట్ పేరు కూడా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుంది. కానీ, ఇతను యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. అయినా కూడా అతడిని, అతడిని ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇతను ఎలాగైనా సివిల్స్ పరీక్షలో నెగ్గాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఒక్కసారి రెండుసార్లు కాదు.. యూపీఎస్సీ కోసం ఏకంగా 12 సార్లు అటెమ్ట్ చేశాడు. అందులో ఐదుసార్లు ఇంటర్య్వూ వరకు వెళ్లాడు. 7 సార్లు మెయిన్స్ వరకు వెళ్లాడు.

Also Read: UPSC Results : UPSC సివిల్స్ ఫలితాలు విడుదల

ఈ క్రమంలో ఏరోజు కూడా అతను నిరాశ, విసుగుచెందలేదు.. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ, పాసవ్వలేకపోయాడు. అయితే, పరీక్షలో తాను ఉత్తీర్ణత సాధించకపోయినా, యూపీఎస్సీ పరీక్ష కోసం తను ప్రయత్నించిన తీరును, తన అనుభవాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే ఏకంగా 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. భారీగా లైక్ లు వచ్చాయి. ‘పరీక్షలో మీరు ఉత్తీర్ణత సాధించకపోవడం విషాదకరం.. అయినా మీ ప్రయత్నం ఎంతో స్ఫూర్తిదాయకం’ అంటూ ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News