BigTV English

Vespa Special Edition: సూపర్బ్ లుక్ తో వెస్పా స్పెషల్ ఎడిషన్.. కేవలం 140 మందికే ఛాన్స్ అంట..!

Vespa Special Edition: సూపర్బ్ లుక్ తో వెస్పా స్పెషల్ ఎడిషన్.. కేవలం 140 మందికే ఛాన్స్ అంట..!

Vespa Special Edition on 140th Anniversary: ఇటాలీయన్ స్కూటర్ బ్రాండ్ వెస్పాకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భారత్‌లో కూడా ఈ కంపెనీ దశాబ్ధాల కాలం నుంచి ఉంది. వెస్పా కొంత కాలం పాటు దేశీయ OEMల భాగస్వామ్యంతో ఉంది. అయితే గత దశాబ్ద కాలంగా స్వతంత్ర సంస్థగా మారింది. ఈ క్రమంలోనే వెస్పా మాతృ సంస్థ పియాజియో ప్రపంచవ్యాప్తంగా తన 140వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని పియాజియో వెస్పా స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది.


‘వెస్పా 140వ పియాజియో’ పేరుతో ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌లో 140 యూనిట్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో విక్రయించనుంది. దీని బుకింగ్ ఏప్రిల్ 18న ప్రారంభమైంది. 66 దేశాలలో 21 ఏప్రిల్ 2024 వరకు ఈ బుకింగ్ కొనసాగుతుంది. అయితే భారతదేశం నుండి ఏ యూనిట్లు రిజర్వ్ చేయబడలేదు.

Also Read: Affordable Cars : ఈ కార్ల ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు!

ఈ వెస్పా స్పెషల్ ఎడిషన్‌లో ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇవి స్కూటర్‌‌కు ఆకర్షణీయమైన లుక్ ఇస్తాయి. వైట్ పెయింట్ స్కీమ్‌తో పాటు, స్కూటర్‌కు ప్రత్యేకమైన బ్లూ యాక్సెంట్‌లు ఇవ్వబడ్డాయి. ఇది స్పోర్టీ, యూత్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది. ఇందులో వెనుక ఫెండర్‌పై ‘140’ బ్రాండింగ్ ఉంది. పియాజియో స్టైల్ సెంటర్ ఇప్పటికే ప్రోటోటైప్‌ను రూపొందించింది. ఇది వెస్పా వరల్డ్ డేస్ 2024 ర్యాలీలో ప్రదర్శించబడే అవకాశం ఉంది.

వెస్పా లేటెస్ట్ టెక్నాలజీ, రెట్రో ఎలిమెంట్‌ల,  క్లాసిక్ డిజైన్  Vespa 300 300 GTV నుండి ప్రేరణ పొందింది. ఇది ఫ్రంట్ ఫెండర్‌పై అమర్చబడిన రౌండ్ హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఆప్రాన్ మౌంటెడ్ పొజిషన్ ల్యాంప్స్, సింగిల్ పీస్ రేసింగ్ సీట్, సైడ్ ఫెండర్‌లపై ఎయిర్ ఫిన్స్, బ్లూ అల్లాయ్ వీల్ రిమ్‌లను కలిగి ఉంది.

Also Read: అదరగొడుతున్న టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ..!

ఇక ఇంజిన్ విషయానికి వస్తే వెస్పా 140వ ఎడిషన్‌లో 278సీసీ సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, 4 వాల్వ్ ఉన్నాయి. ఇది 8,250 ఆర్‌పిఎమ్ వద్ద 23.8 బిహెచ్‌పి పవర్‌ని, 5250 ఆర్‌పిఎమ్ వద్ద 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. దీని ఆయిల్ ట్యాంక్ సామర్థ్యం 30.3 కిమీ/లీ. ఇది పూర్తి LED ఇల్యూమినేషన్, పూర్తి-డిజిటల్ సర్క్యులర్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఫీచర్లతో ఉంటుంది. అలాను కీలెస్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి సూపర్బ్ ఫీచర్లు ఉన్నాయి.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×