BigTV English
Advertisement

Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్‌ని ఎందుకు సెలక్ట్ చేయలేదు?

Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్‌ని ఎందుకు సెలక్ట్ చేయలేదు?

Ruturaj Gaikwad: రుతురాజ్ ని శ్రీలంక టూర్ కి ఎందుకు సెలక్ట్ చేయలేదు? ఇప్పుడీ మాట నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. సీఎస్కే కెప్టెన్ గా ఉన్న రుతురాజ్ ఐపీఎల్ 2024లో అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాటర్ గా ఉన్నాడు. మొదటి స్థానంలో విరాట్ కొహ్లీ (741) పరుగులతో ఉంటే, రెండో స్థానంలో రుతురాజ్ (583) పరుగులతో ఉన్నాడు. అలాగే జింబాబ్వే టూర్ లో రుతురాజ్ రెండు మ్యాచ్ ల్లో 77, 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా 5 మ్యాచ్ ల్లో 133 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు.


వన్డే వరల్డ్ కప్ 2023 అయిపోయిన వెంటనే ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఇండియా ఆడింది. అక్కడ రుతురాజ్ అద్భుతంగా ఆడి 223 పరుగులు చేశాడు. అంతకు ముందు 2021లో జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో 5 టీ 20 సిరీస్ లో 218 పరుగులు చేశాడు.

ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారి తను నిరూపించుకుంటూనే ఉన్నాడు. జింబాబ్వే పర్యటనలో అయితే, ఏ డౌన్ లో పంపిస్తే ఆ డౌన్ లో వెళ్లి రాణించాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 27 ఏళ్ల రుతురాజ్ ప్రస్తుతం సీఎస్కే కెప్టెన్ గా ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ తన తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు రుతురాజ్ కి అప్పగించాడు. ధోనీ నమ్మకం పొందిన రుతురాజ్ కి అదే శాపంగా మారిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Also Read: యూఏఈపై భారత్ ఘన విజయం.. బౌండరీలతో అదరగొట్టిన రిచా

ఎందుకంటే గౌతంగంభీర్ కెరీర్ ముగిసిపోవడానికి ఒకరకంగా మహేంద్ర సింగ్ ధోనీ కారణమనే అపోహలున్నాయి. ఎందుకంటే 2011లో వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమ్ లో గంభీర్ కీలకపాత్ర పోషించాడు. తర్వాత తను కెప్టెన్ కావల్సినవాడు ధోనీ వెలుగు ముందు మసకబారిపోయాడు. క్రమంగా ఆటకు దూరమైపోయాడు. ఆ పగని మనసులో పెట్టుకుని ధోనీని సాధించడానికి రుతురాజ్ ని బలిచేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

అయితే చాలామంది అనేదేమిటంటే గౌతం గంభీర్ లాంటి మానవతావాది, పేదపిల్లల కోసం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తిని అలా కించపరిచి మాట్లాడవద్దని అంటున్నారు. శ్రీలంక టూర్ లో ఎవరి టాలెంట్ ఎంతో తేలిపోతుంది..దాంతో రుతురాజ్ కి లైన్ క్లియర్ అవుతుందని అంటున్నారు. ఇక అక్కడ నుంచి టీమ్ ఇండియాలో రుతురాజ్ ప్లేస్ సుస్థిరం అవుతుందని అంటున్నారు.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×