BigTV English
Advertisement

3 People Died due to Electric Shock: సనత్‌నగర్‌లో విషాదం.. ముగ్గురు మృతి

3 People Died due to Electric Shock: సనత్‌నగర్‌లో విషాదం.. ముగ్గురు మృతి

3 people died due to electric shock: హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇతర ఇతర వార్తా కథనాల ప్రకారం.. సనత్ నగర్ జెక్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ రెండో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో ముగ్గురు మృతిచెందారు.


అయితే, ఆదివారం ఉదయం పని మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఎవరూ కనిపించలేదు. అనంతరం ఆమె ఇంట్లో పని చేసి వెళ్లిపోయింది. మళ్లీ సాయంత్రం 3 గంటలకు వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఎవరూ కనిపించకపోయేసరికి.. మరోసారి ఇళ్లంతా వెతికింది. ఈ క్రమంలో బాత్ రూమ్ డోర్ లాక్ అలాగే ఉండడంతో అనుమానం వచ్చి అపార్ట్ మెంట్ నిర్వాహకులకు విషయం తెలియజేసింది.

Also Read: రీల్స్ చేస్తూ..రియల్ గానే పోయాడు..అంబర్ పేటలో విషాదం


వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని డోర్ పగులగొట్టి చూడగా ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు. అయితే, తొలుత వీరు విద్యుత్ షాక్‌తో మృతిచెందినట్లు భావించినప్పటికీ, అలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ సాయంతో ఘటనా స్థలి వద్ద ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించనున్నట్లు పోలీసులు చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.

Tags

Related News

Tirupati Tragedy: ఏపీలో మరో విషాదం.. స్వర్ణముఖి నదిలో నలుగురు గల్లంతు

Delhi ISIS Attack Foiled: దీపావళి నాడు భారీ ఉగ్రదాడికి కుట్ర.. భగ్నం చేసిన దిల్లీ పోలీసులు.. ఇద్దరు ఐసిస్ మద్దతుదారులు అరెస్ట్

Kurnool Bus Accident: బస్సును తొలగిస్తుండగా మరో ప్రమాదం.. క్రేన్ బోల్తా

Crime News: బలవంతంగా నాలుగు సార్లు రేప్ చేసిన ఎస్ఐ.. సూసైడ్ నోట్ రాసి మహిళా డాక్టర్ ఆత్మహత్య

Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. గాయపడిన, సురక్షితంగా ఉన్న ప్రయాణికులు వీళ్లే

Kurnool Bus Accident: కర్నూలు బస్సు దగ్ధం ఘటన.. 16 బృందాలతో దర్యాప్తు.. రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటన

Pune Crime: భార్యపై అనుమానం పెనుభూతం.. చివరకు భర్త గొంతు కోసింది, ఆ తర్వాత

Student Suicide: గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Big Stories

×